- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల్లో పట్టుకోసం పడరాని పాట్లు..!
<p>దిశ ప్రతినిధి, మేడ్చల్: బల్దియా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రజల్లో పట్టుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు డివిజన్లలో చేసిన అభివృద్ధి గురించి విస్త్రృతంగా ప్రచారం చేస్తుండగా, మిగతా పార్టీల అభ్యర్థులు స్థానికంగా నెలకొన్న సమస్యలను కరపత్రాలు ము ద్రించి ప్రచారం చేస్తున్నారు. ప్రజా సమస్యలను మేమంటే మేము తీరుస్తామంటూ ఊదరగొడుతున్నారు. దీంతో ప్రజలు సైతం అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజా నాడీ ఎలా ఉందో తెలుసుకుని వారిని ప్రసన్నం చేసుకునేందుకు […]</p>

దిశ ప్రతినిధి, మేడ్చల్: బల్దియా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రజల్లో పట్టుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు డివిజన్లలో చేసిన అభివృద్ధి గురించి విస్త్రృతంగా ప్రచారం చేస్తుండగా, మిగతా పార్టీల అభ్యర్థులు స్థానికంగా నెలకొన్న సమస్యలను కరపత్రాలు ము ద్రించి ప్రచారం చేస్తున్నారు. ప్రజా సమస్యలను మేమంటే మేము తీరుస్తామంటూ ఊదరగొడుతున్నారు. దీంతో ప్రజలు సైతం అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజా నాడీ ఎలా ఉందో తెలుసుకుని వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు.
బల్దియా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య రాజకీయ క్రీడ రసవత్తరంగా సాగుతోంది. ఒక్కో డివిజన్ లో పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీలో నిలిచారు. డివిజన్లలో సమస్యలను మేమే తీర్చుతామంటూ హామీలు గుప్పిస్తున్నారు. అయితే హామీల వర్షం కురిపిస్తున్న అభ్యర్థులకు డివిజన్ల మీద ఉన్న పట్టు ఎంత..? ప్రజా సమస్యల వలయాన్ని చేధించ గలిగే సత్తా ఉందా..? హామీల వర్షం కేవలం గెలుపు కోసమేనా..? అంటూ అభ్యర్థులపై ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సందేహాలు తీరేనా.. ఇప్పటికైనా వారి కష్టాలు కడతేర్చే నాయకుడు వచ్చేనా..? అంటే ఆ జవాబు కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. పోలీంగ్ తేది డిసెంబర్ 1న దగ్గర పడుతున్న కొద్దీ డివిజన్లలో ఓటర్లపై పట్టుకోసం అభ్యర్థులు తెగ కష్టపడుతున్నారు. విజయం సాధించాలని రాత్రింబవళ్లు ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు చిత్ర, విచిత్ర వేషాలు వేస్తున్నారు. సిట్టింగ్ కార్పొరేటర్లు తాము డివిజన్లలో చేసిన అభివృద్ధి గురించి విస్త్రృతంగా ప్రచారం చేస్తుండగా, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు వార్డుల్లో ఉన్న సమస్యలను కరపత్రాలుగా ముద్రిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. సమస్యల వలయాలను చేధించే నాయకులకే ప్రజలు పట్టం కడుతారా లేదా మాటలు చెప్పే నాయకులనే అదరిస్తారా.. అనేది వారం రోజులు గడిస్తేనే గాని బయటపడదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
సమస్యలతో కరపత్రాలు..
గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను కరపత్రాల్లో ముద్రిస్తూ.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్న నాయకులు కొందరైతే.. తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన అభ్యర్థులు మరి కొందరు ఉన్నారు. స్థానికంగా తాము డివిజన్ లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తామంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు రోజుకోక వాగ్దానంతో ప్ర జల్లోకి వెళ్తున్నారు. అయితే అభ్యర్థుల మాటలు ఎంత వరకు ప్రజలు విశ్వసిస్తారనేది ఫలితాల నాడే బయట పడుతుంది. సిట్టింగ్ కార్పొరేటర్లపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రత్యర్థి అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో ఉన్న అసంతృప్తులను తమకు అనుకూలంగా మార్చుకుం టూ ఓట్లను కొల్లగొట్టాలనే ప్రణాళికలతో దూసుకుపోతున్నారు.
సొంత మేనిఫెస్టోలతో..
ప్రధాన పార్టీలు రూపొందించిన మేనిఫెస్టోలకు తోడు త మ డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి స్వతహా గా మ్యానిఫెస్టోలను తయారు చేసుకున్నారు. మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపిస్తున్నారు. డివిజన్లలో ఉన్న కామన్ సమస్యలతోపాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ ప రిధిలో లేని వాగ్ధానాలను జోడించారు. డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం.. యువతకు ఉద్యోగం క ల్పిస్తాం.. మహిళలకు ఉపాధి అవకాశాలు చూపిస్తామంటూ ఊదరగొడుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పింఛన్లు, ఆహారభద్ర తా కార్డులు, కల్యాణలక్ష్మీ, షాదీముబరాక్ వంటి పథకాలను ఇప్పిస్తామంటూ సర్కారు అమలు చేస్తున్న పథకాలను తమ మేనిఫెస్టోలో చేర్చుకున్నారు. అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు కాకుండా ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు సై తం హామీలివ్వడం చర్చనీయాంశంగా మారింది.






