మహనీయులారా… మన్నించండి!

by  |
మహనీయులారా… మన్నించండి!
X

దిశ, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా మహానీయులుగా కీర్తించే డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఏప్రిల్ నెలలోనే ఉన్నాయి. వీరిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మన దేశ రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించారు. బాబు జగ్జీవన్ రామ్ మన దేశానికి తొలి ఉప ప్రధానిగా పని చేశారు. ఇక మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల ప్రజలను నిత్యం చైతన్య పరిచారు. వీరి ముగ్గురి జీవితాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 5న, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఏప్రిల్ 11, అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న యావత్తు దేశమంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలంతా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అయితే, దేశంలో తొలిసారిగా ఈ మహనీయుల జయంతి ఉత్సవాలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో బషీర్బాగ్ చౌరస్తాతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను అలంకరణ చేయలేదు. ప్రతి ఏడాది వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభిమానుల కోలాహలం లేకుండా ట్యాంక్ బండ్, బషీర్ బాగ్ ప్రాంతాలు మొదటిసారిగా కనిపించాయి.

Tags: Jayanti celebration, government, cancellation, Jagjivan Ram, Jayanti, April 5, statues, decoration, fans, tank bund, Basheer Bagh, Hyderabad


Next Story

Most Viewed