కెమెరా రోల్.. 3..2..1.. యాక్షన్

66

దిశ, వెబ్‌డెస్క్ : మొన్నటి వరకూ న్యూ ఇయర్ తర్వాత సినిమా మొదలు పెడదాం అనుకున్న వాళ్లు కూడా ఇప్పుడు షూటింగ్ కి సిద్దమయ్యారు. నాన్ స్టాప్ షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకుని ఎక్కడా రిలాక్స్ అవ్వకుండా హీరోలు ఏ ఏ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నారో చూద్దాం.

కొత్త సంవత్సరం కొత్త కొత్త ప్లాన్స్ తో షూటింగ్ స్ట్రాటజీతో సినిమా షూట్ స్టార్ట్ చేశారు హీరోలతో పాటు మేకర్స్. RRR మార్చి నాటికి షూటింగ్ కంప్లీట్ చేద్దామనుకున్న రాజమౌళికి రామ్ చరణ్ కి కరోనా రావడంతో షూట్ కి బ్రేక్ పడింది. అయినా మిగిలిన నటులతో సినిమాని ఆర్ఎఫ్‌సి లో కంటిన్యూ చేస్తున్నారు. మరో టాలీవుడ్ మోస్ట్ వెయిటింగ్ మూవీ ప్రభాస్ రాధే శ్యామ్. ఈ ప్యాన్ ఇండియా సినిమా కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరుపుకుంటోంది.

సీనియర్ హీరోలు కూడా ఫుల్ స్పీడ్ మీదున్నారు. చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ కొకాపేట్ సెట్ లో జరుగుతుంటే.. బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా షూటింగ్ ఖైరతాబాద్ లో షూట్ చేసుకుంటోంది. నారప్ప సినిమా ఫైనల్ టచెస్ కోసం నానక్ రామ్ గుడా రామానాయుడు స్టూడియో లో షూటింగ్ జరుగుతోంది.

మాస్ మహారా మాంచి స్పీడ్ మీదున్నారు. క్రాక్ రిలీజ్ కావడంతో తన నెక్ట్స్ సినిమా షూట్ కంటిన్యూ చేస్తున్నారు. రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమా బాచుపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర జరుగుతోంది. సాయిపల్లవి-రానా విరాట పర్వం షూటింగ్ తుఫ్రాన్ విలేజ్ లో రియల్ లొకేషన్స్ లో బిజీగా ఉంది.

రాహుల్ సాంస్కృత్యన్ -నాని కాంబినేషన్లో తెరెకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ షూటింగ్ హైదరాబాద్ కొంపల్లిలో జరుగుతుంది. మొన్నటి వరకూ స్కిప్ట్ చేంజెస్ కోసం టైమ్ స్పెండ్ చేసిన అఖిల్ బొమ్మరిల్లు- భాస్కర్ కాంబోలో వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ ఇప్పుడు మాదాపూర్ లో జరుగుతోంది.

నాగచైతన్య- విక్రమ్ కే కుమార్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంటే.. గోపీచంద్ సిటిమార్ సినిమా షూట్ ఫిలిం సిటీలో జరుగుతుంది. కార్తికేయ చావు కబురు చల్లగా హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో జరుగుతుండగా.. నిఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న సినిమా 18pages హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో షూటింగ్ కంటిన్యూ చేస్తోంది.