పీఎల్ఐ పథకానికి కేబినెట్ ఆమోదం

by  |
పీఎల్ఐ పథకానికి కేబినెట్ ఆమోదం
X

న్యూఢిల్లీ: రూ. 18,100 కోట్ల వ్యయంతో బ్యాటరీ స్టోరేజిని ప్రోత్సహించే ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక (పిఎల్‌ఐ) పథకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని అధ్యక్షతన వర్చువల్‌గా కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశం అయింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో బ్యాటరీ స్టోరేజీ నిర్ణయాన్ని తీసుకున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. నేషనల్ ప్రోగ్రాం ఆన్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజ్ రూ .45 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. 50 గిగావాట్ అవర్ ఎసిసి, 5 గిగావాట్ల సముచిత ఏసీసీ ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించాలని ఈ ప్రతిపాదనను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రధానమైన సెక్టార్‌లో భారత్‌ను ఆత్మనిర్బరంగా చేయడానికి బ్యాటరీ స్టోరేజి తయారీకి రూ. 18,100 కోట్ల విలువైన బెన్ ఫిట్స్ ప్రకటించినట్టు తెలిపారు.

ఇక మరోవైపు ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)కి చెందిన 1500 చమీల స్థలాన్ని ముస్సోరిలో ఉత్తరఖండ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఏరియల్ ప్యాసింజర్ రోప్ వే‌కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఇక దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత విషయంలో కేంద్రంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి రోజు దేశంలో వ్యాక్సినేషన్ పరిస్థితిని ప్రజల ముందు ఉంచాలనీ కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీడియా ద్వారా అందరికి అందిచాలని కేంద్రం నిశ్చయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.


Next Story

Most Viewed