- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ సీనియర్ నటుడికి తీవ్ర గాయాలు.. హాస్పిటల్‌లో చేరిక
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళ సీనియర్ నటుడు కార్తీక్ తీవ్ర గాయలపాలయ్యారు. ఉదయం వ్యాయామం చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన మెడ, కాలుకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కార్తీక్ ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. ఇకపోతే కార్తిక్ అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులోను నటించి మెప్పించాడు. ముఖ్యంగా కార్తీక్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళ సీనియర్ నటుడు కార్తీక్ తీవ్ర గాయలపాలయ్యారు. ఉదయం వ్యాయామం చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన మెడ, కాలుకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కార్తీక్ ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. ఇకపోతే కార్తిక్ అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులోను నటించి మెప్పించాడు. ముఖ్యంగా కార్తీక్ నటించిన ‘సీతాకోక చిలుక’ తెలుగులో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ‘అన్వేషణ’, ‘మగరాయుడు’, ‘అభినందన’, ‘అనుబంధం’, ‘ఘర్షణ’ చిత్రాలు ఆయనను తెలుగు అభిమానులకు దగ్గర చేశాయి. చివరగా కార్తీక్ తెలుగులో ‘విలన్’ సినిమాలో నటించాడు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Next Story






