- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాదాపూర్‌లో వ్యాపారి కిడ్నాప్
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఈ మధ్య వరుసగా జరుగుతున్న కిడ్నాప్‌లు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. ఒక కిడ్నాప్ ఘటన మరువకముందే మరో కిడ్నాప్ జరిగి కలకలం సృష్టిస్తోంది. దీంతో హైదరాబాద్ నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా శనివారం మాదాపూర్‌లో ఓ వ్యాపారి కిడ్నాప్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ జరిగినట్టు తెలుస్తోంది. ధీరజ్ రెడ్డి అనే వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అయితే భార్యకు సంబంధించిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఈ మధ్య వరుసగా జరుగుతున్న కిడ్నాప్‌లు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. ఒక కిడ్నాప్ ఘటన మరువకముందే మరో కిడ్నాప్ జరిగి కలకలం సృష్టిస్తోంది. దీంతో హైదరాబాద్ నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా శనివారం మాదాపూర్‌లో ఓ వ్యాపారి కిడ్నాప్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ జరిగినట్టు తెలుస్తోంది. ధీరజ్ రెడ్డి అనే వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అయితే భార్యకు సంబంధించిన బంధువులే ధీరజ్ రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ కిడ్నాప్‌నకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






