Zomato: రెస్టారెంట్లకు జొమాటో కస్టమర్ల డేటా

by S Gopi |   (  Updated:2025-11-20 12:12:15  IST  )

ఇదే గనక జరిగితే ఇతర్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు సైతం దీన్ని అనుసరించే అవకాశం ఉంది

Zomato: రెస్టారెంట్లకు జొమాటో కస్టమర్ల డేటా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తన వద్ద ఉన్న కస్టమర్ల డేటాను రెస్టారెంట్లతో పంచుకునేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ)తో జొమాటో అవసరమైన చర్చలు జరుపుతున్నట్టు ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. ఇదే గనక జరిగితే ఇతర్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు సైతం దీన్ని అనుసరించే అవకాశం ఉంది. ఈ అంశం గడిచిన దశాబ్ద కాలంగా చర్చలో ఉంది. ఇప్పటివరకు ఫుడ్ డెలివరీ యాప్స్ ఆర్డర్ చేసే కస్తమర్ల వివరాలను రెస్టారెంట్లకు కనబడకుండా చేస్తూ వచ్చాయి. ఒకవేళ ఎన్ఆర్ఏఐతో జరిగే చర్చలు సఫలమైతే జొమాటో కొత్త ఫీచర్ రూపంలో దీన్ని పరీక్షించనుంది. అయితే, కస్టమర్ల ఫోన్ నంబర్లు రెస్టారెంట్లకు ఇచ్చేందుకు వారి ముందస్తు అనుమతి తప్పనిసరి అవుతుంది. ఆ తర్వాతే నంబర్లను జొమాటో రెస్టారెంట్లకు స్తుంది. వాటిని రెస్టారెంట్లు ప్రమోషన్ కోసం వాడుకుంటాయి.

ఈ అంశం కొన్నేళ్ల నుంచి చర్చలో ఉంది. గతంలో దీనిపై కస్టమర్లు వ్యతిరేకించారని డెలివరీ యాప్ వెల్లడించాయి. తమ డేటా దుర్వినియోగమవుతుందని కస్టమర్లు చెబుతున్నట్టు పేర్కొన్నాయి. కానీ, రెస్టారెంట్ల వాదన ఇందుకు భిన్నంగా ఉంది. ఈ ఫీచర్ ద్వారా ఎవరు ఎలాంటి ఆర్డర్ చేస్తున్నారు? ఎన్నిసార్లు చేస్తున్నారనే వివరాలు తమకు అవగాహనకు వస్తుంది. దాన్ని అనుసరించి కస్టమర్ల ఇష్టానికి తగినట్టుగా ఆఫర్లు ఇవ్వడం, మార్కెటింగ్ కోసం డేటాను ఉపయోగిస్తామని చెబుతున్నాయి. ఇన్నేళ్లుగా ఫుడ్ డెలివరీ విభాగంలో జొమాటో, స్విగ్గీ కంపెనీలదే ఆధిపత్యం. ఇటీవల ర్యాపిడో సైతం ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టడంతో పోటీ పెరిగింది.

Next Story