- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Food Delivery Platforms: డెలివరీ ఏజెంట్లకు అదనపు చెల్లింపులు ఆఫర్ చేస్తున్న జొమాటో, స్విగ్గీ
ఇటీవల దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మెకు దిగిన నేపథ్యంలో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లైన జొమాటో, స్విగ్గీ తమ డెలివరీ ఏజెంట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించాయి. సాధారణంగా పండుగ సమయాల్లో డెలివరీ సేవలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇచ్చే తరహాలో ఈ ప్రోత్సాహకాలను ప్రకటించాయి. ఇటీవల దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మెకు దిగిన నేపథ్యంలో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పని వాతావరణం, సామాజిక భద్రత వంటి కారణాలతో గిగ్ వర్కర్లు డిసెంబర్ 25 నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. పరిశ్రమ వర్గాల ప్రకారం, డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు, నూతన సంవత్సర వేడుక సందర్భాల్లో జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సంస్థలపై సమ్మె ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అత్యధిక ఆర్డర్లు వస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఒక్కో ఆర్డర్‌పై రూ. 120-150 వరకు చెల్లించాలని నిర్ణయించినట్టు జొమాటో స్పష్టం చేసింది. ఆర్డర్ క్యాన్సిలేషన్లపైనా పెనాల్టి ఉండవని కంపెనీలు పేర్కొన్నాయి. స్విగ్గీ సైతం పీక్ అవర్స్‌లో గరిష్ఠంగా రూ. 2 వేల వరకు ఆర్జించే అవకాశం ఉంటుందని డెలివరీ ఏజెంట్లకు ఆఫర్ చేస్తున్నాయి.






