Zomato: పోషకాహారం కోసం జొమాటో సరికొత్త ఫీచర్

by S Gopi |

కస్టమర్లు ఆర్డర్ చేసే ఫుడ్‌లోని పోషక విలువలకు సంబంధించిన రేటింగ్ తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Zomato: పోషకాహారం కోసం జొమాటో సరికొత్త ఫీచర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో సోమవారం కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. కస్టమర్లు ఆర్డర్ చేసే సమయంలో పోషకాలతో ఉన్న ఆహారం ఎంచుకునేందుకు వీలుగా 'హెల్తీమోడ్' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వరా కస్టమర్లు ఆర్డర్ చేసే ఫుడ్‌లోని పోషక విలువలకు సంబంధించిన రేటింగ్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. వంటకాలకు ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్, సూక్ష్మపోషకాల ఆధారంగా లో నుంచి సూపర్ వరకు ఆరోగ్యకరమైన స్కోరు ఉంటుంది. జొమాటో యాప్ ప్రకారం, ప్రోటీన్ సాంద్రత, పదార్థాల నాణ్యత, వంట పద్ధతి, కార్బోహైడ్రేట్ నాణ్యత, ఇతర అంశాల ఆధారంగా స్కోరు ఉంటుంది. జొమాటో పేరెంట్ ఎటర్నల్ సీఈఓ దీపిందర్ గోయల్ దీని గురించి మాట్లాడుతూ.. కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేశాం. కానీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం అందించేందుకు ఇప్పటిదాకా సరైన అవకాశం లేదు. ఈ లోటును భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే హెల్తీమోడ్ ఫీచర్ ప్రారంభించాం. దీని ద్వారా ఆహార పదార్థాలకు స్కోర్ ఉంటుంది. ప్రస్తుతం ఈ సదుపాయం గురుగ్రామ్‌లో మాత్రమే ఉంది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు.

Next Story