Zomato: జొమాటో యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్ తీసుకొచ్చిన సంస్థ..!

by Maddikunta Saikiran |

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) తమ వినియోగదారులను మరింత దగ్గర అయ్యేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ల(Features)ను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే.

Zomato: జొమాటో యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్ తీసుకొచ్చిన సంస్థ..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) తమ వినియోగదారులను మరింత దగ్గర అయ్యేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ల(Features)ను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలె ఫుడ్ వేస్టేజ్(Food wastage)ను తగ్గించడానికి ఫుడ్ రెస్క్యూ(Food Rescue) అనే ఫీచర్ తీసుకొచ్చిన ఆ సంస్థ తాజాగా 'రికమండేషన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్(Recommendations From Friends)' పేరుతో మరో కొత్త ఫీచర్ ను కస్టమర్లు కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్లు ఈ ఫీచర్ సహాయంతో స్నేహితులకు ఫుడ్ రికమండ్ చేసే అవకాశం ఉంటుంది. అందులో ఫ్రెండ్స్ రికమండ్ చేసిన ఫుడ్ ఐటమ్స్(Food Items), రెస్టారెంట్ పేర్లు(Restaurant Names) కనిపిస్తాయి. దీంతో మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాటిని ఆర్డర్(Order) చేసుకునే వీలు ఉంటుంది. కాగా ఏడు రోజుల క్రితమే ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టామని, లేటెస్ట్ వెర్షన్ యాప్(Latest Version App)లో ఇది అందుబాటులో ఉంటుందని జొమాటో సీఈఓ రాకేష్ రంజన్(Rakesh Ranjan) ఓ ప్రకటనలో వెల్లడించారు.

Next Story