- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.50 వేలకే ఎలక్ట్రిక్ బైక్...ఫీచర్స్ అదుర్స్ !
ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు...

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు... ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే వాడుతున్నారు. ఇందులో... ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు కూడా ఉన్నాయి. చాలామంది ఆఫీస్ కు వెళ్లేందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్నారు. పెట్రోల్ ధరలు వంద రూపాయలు దాటడంతో... ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసి.. ఖర్చుల నుంచి తప్పించుకుంటున్నారు. దీనికి తగ్గట్టుగానే రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి.
ఇందులో భాగంగానే... తాజాగా జలియో -ఇ మొబిలిటీ (ZELIO) తన ఈవా ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వర్షన్ తీసుకువచ్చింది. పేస్ లిస్టు మోడల్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరు గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంది. ఇక కొత్త ఈవా 2025 బైక్... గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. అలాగే ఇది ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే 120 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంతేకాదు ఈ స్కూటర్ నడిపేందుకు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. ఆర్టీవో ఆఫీస్ కు వెళ్లాల్సిన పని అస్సలు ఉండదు. షోరూంలో కొనుగోలు చేసి... మనం డ్రైవ్ చేయవచ్చు. ఇక ఈ స్కూటర్ బరువు వచ్చేసి.. 85 కిలోలు ఉంటుంది.
150 నుంచి 170 కిలోల వరకు బరువును ఈ బైక్ మోయగలదు. ఎన్ని కిలోమీటర్లు అయిన ఇద్దరు హాయిగా కూర్చుని వెళ్లవచ్చు. ఈ బైక్ ధర 50 వేలుగా ఫిక్స్ చేశారు. అయితే పలు మోడల్స్ లో ఈ బైక్ రిలీజ్ చేశారు. 60v/32AH మోడల్ ధర 50,000 వరకు ఉంటుంది. ఇది ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 80 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 72v/42AH మోడల్ బైక్ ధర 54 వేల రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఈ బైక్ మైలేజ్ 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 74v వెర్షన్ బైక్ ధర 69,000గా ఫిక్స్ చేశారు. ఈ బైక్ ఫుల్ ఛార్జింగ్ పెడితే 120 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.






