Youtube: కంటెంట్ క్రియేటర్ల కోసం డీప్‌ఫేక్‌ల అడ్డుకట్టకు యూట్యూబ్ కొత్త ఏఐ టూల్

by S Gopi |

ఈ టెక్నాలజీ ఆధారంగా ఏఐను ఉపయోగించి రూపొందించిన, ఎడిట్ చేసిన డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించవచ్చు.

Youtube: కంటెంట్ క్రియేటర్ల కోసం డీప్‌ఫేక్‌ల అడ్డుకట్టకు యూట్యూబ్ కొత్త ఏఐ టూల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: కంటెంట్ క్రియేటర్లకు మరింత భద్రత అందించేందుకు యూట్యూబ్ సరికొత్త ఏఐ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘లైక్‌నెస్‌ డిటెక్షన్‌ టూల్' పేరుతో ప్రారంభించిన ఈ టెక్నాలజీ ఆధారంగా ఏఐను ఉపయోగించి రూపొందించిన, ఎడిట్ చేసిన డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించవచ్చు. ఏఐను వాడి కంటెంట్‌ను క్రియేట్ చేసే ధోరణి పెరిగిన నేపథ్యంలో యూజర్ల రక్షణ కోసం ఈ ఏఐ టూల్‌ను తీసుకొచ్చామని యూట్యూబ్ వెల్లడించింది. ఈ టూల్‌ను ఉపయోగించి కంటెంట్ క్రియేటర్లు వారి ఫేస్ లేదా వాయిస్‌ను అనుమతి లేకుండా వాడుకుని ఏఐ వీడియోలను ఎవరైనా రూపొందిస్తే, వాటిని తొలగించమని కోరే వీలు కల్పిస్తుంది. ఈ టూల్ యూట్యూబ్ స్టూడియోలోని కంటెంట్ డిటెక్షన్ విభాగంలో ఉంటుంది. దీన్ని ఉపయోగించడానికి కంటెంట్ క్రియేటర్లు తమ గుర్తింపును ధృవీకరించాలి. ఫోటో ఐడీతో పాటు సెల్ఫీ వీడియో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని యూట్యూబ్ తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత లైక్‌నెస్‌ డిటెక్షన్‌ టూల్ కంటెంట్ క్రియేటర్ల ఫేస్, వాయిస్ వాడి చేసిన ఏఐ వీడియోలను గుర్తించి, అలర్ట్ చేస్తుంది. దానివల్ల వారు సదరు వీడియో, ఛానెల్ పేరు, వ్యూవ్స్ లాంటి వివరాలను చూసే ఆస్కారం లభిస్తుంది. ఆపై డీప్‌ఫేక్ వీడియోలను తొలగించడానికి రిక్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ టూల్‌ను యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ మెంబర్స్‌కు మాత్రమే అందిస్తున్నామని, 2026 నాటికి కంటెంట్ క్రియేటర్లందరికీ అందుబాటులోకి తెస్తామని యూట్యూబ్ పేర్కొంది.

Next Story