- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Yamaha: తొలి ఈవీ స్కూటర్ విడుదల చేసిన యమహా
ఎంపిక చేసిన నగరాల్లో కంపెనీకి చెందిన బ్లూ స్క్వేర్ ప్రీమియం షోరూంలలో వీటిని కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ మంగళవారం తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈసీ-06ని మార్కెట్లో విడుదల చేసింది. బ్లూయిష్ వైట్ రంగులో అందుబాటులోకి వచ్చిన దీని ధరను రూ.1,67,600 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా నిర్ణయించామని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌కు ఒకసారి ఫుల్‌ఛార్జ్ చేస్తే 169 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, ఎంపిక చేసిన నగరాల్లో కంపెనీకి చెందిన బ్లూ స్క్వేర్ ప్రీమియం షోరూంలలో వీటిని కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. 4కిలోవాట్ అవర్ బ్యాటరీతో లభించే ఈ స్కూటర్ గంటకు 79 కి.మీ గరిష్ట వేగాన్ని, 26 టార్క్, 6.7 కిలోవాట్ పవర్‌ను అందిస్తుంది. రోజువారీ అవసరాలకు ఈ స్కూటర్ మెరుగ్గా సరిపోతుంది. బ్యాటరీ మూడేళ్లు లేదా 30 వేల కి.మీ వారెంటీతో వస్తుందని, సాధారణ హోమ్ ప్లగ్-ఇన్ ఆప్షన్‌తో సులభంగా ఛార్జింగ్ చేసుకోవచ్చని కంపెనీ వివరించింది. 8 గంటల్లో బ్యాటరీ పూర్తి ఛార్జింగ్ అవుతుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కార్బన్ న్యూట్రాలిటీ తగ్గించాలనే లక్ష్యాలకు అనుగుణంగా ఈవీ విభాగంలోకి అడుగు పెడుతున్నామని, అందుకు కట్టుబడి ఈసీ-06ని లాంచ్ చేశామని యమహా మోటార్ ఇండియా ఛైర్మన్ హజీమే అయోటా చెప్పారు.






