Xiaomi కొత్త Smart TV 5A Pro.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ

by Disha Web Desk 17 |
Xiaomi కొత్త Smart TV 5A Pro.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోకి మరో స్మార్ట్ టీవీ లాంచ్ అయింది. చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Xiaomi కొత్తగా అందుబాటు ధరలో 32-అంగుళాల 5A ప్రో స్మార్ట్ టీవీని భారత్‌లో విడుదల చేసింది. ఇది ఇంతకు ముందు లాంచ్ చేసిన Xiaomi Smart TV 5A కి అప్‌గ్రేడ్ వెర్షన్. Xiaomi Smart TV 5A Pro 32-inch TV, Android 11 ఆధారంగా ప్యాచ్‌వాల్ 4పై పనిచేస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో HD-రెడీ (768 x 1,366 పిక్సెల్‌లు), వివిడ్ పిక్చర్(VPE), 85 శాతం DCI-P3 కలర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 178-డిగ్రీల నుంచి చూసిన డిస్‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది.



సౌండ్ కోసం 24W ఆడియో అవుట్‌పుట్‌తో రెండు స్పీకర్లను కలిగి ఉంది. టీవీకి డాల్బీ ఆడియో అలాగే, DTS వర్చువల్-X సపోర్ట్ కూడా ఉంది. ఇది ఆటో-తక్కువ లేటెన్సీ మోడ్ (ALLM), డాల్బీ అట్మోస్ పాస్-త్రూ (ARC)ని కూడా అందిస్తుంది. G31 MP2 GPU, 1.5GB RAM తో పాటుగా క్వాడ్-కోర్ కార్టెక్స్-A55 CPU ద్వారా పని చేస్తుంది. ఇది 8GB మెమరీని కలిగి ఉంటుంది.

Android/iOS రెండింటి ద్వారా స్క్రీన్ మిర్రరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రీలోడెడ్ Google అసిస్టెంట్‌కి హ్యాండ్స్-ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తుంది. వివిధ యాప్‌ల కోసం Google Play స్టోర్‌ సపోర్ట్ కూడా ఉంది. HDMI 2.0, USB పోర్ట్‌‌లు, Wi-Fi, బ్లూటూత్ v5.0 కనెక్టివిటీని కూడా అందిస్తుంది.

దీని ధర రూ. 16,999. అమెజాన్, Mi.com, Mi హోమ్ స్టోర్‌లు, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా అమ్మకానికి రానుంది. కొనుగోలు సమయంలో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌, EMI పై రూ. 1,500 వరకు తగ్గింపు పొందవచ్చు.

Jio Phone 5G: అతి తక్కువ ధరకే జియో 5జీ స్మార్ట్‌ఫోన్.. ప్రత్యేకతలు ఇవే?


Next Story

Most Viewed