- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Inflation: రెండేళ్ల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
ఇది రెండేళ్ల కనిష్టమని, అంతేకాకుండా వరుసగా రెండో నెలా డబ్ల్యూపీఐ సూచీ ప్రతికూలంగా నమోదైందని డేటా పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం మరోసారి ప్రతికూలంగా నమోదైంది. గురువారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జూలై నెలకు సంబంధించి టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం -0.58 శాతానికి పడిపోయింది. ఇది రెండేళ్ల కనిష్టమని, అంతేకాకుండా వరుసగా రెండో నెలా డబ్ల్యూపీఐ సూచీ ప్రతికూలంగా నమోదైందని డేటా పేర్కొంది. ప్రధానంగా కూరగాయలు వంటి ఆహార పదార్థాలు, ముడి పెట్రోలియం, సహజ వాయువు లాంటి వాటి ధరలు దిగిరావడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణం. అంతకుముందు జూన్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం -0.13 శాతంగా, 2024, జూలైలో 2.10 శాతంగా ఉంది. ఈ ఏడాది మే నెలలో 14 నెలల కనిష్టం 0.39 శాతంగా నమోదైంది. సమీక్షించిన నెలలో ఆహార పదార్థాలు 0.96 శాతానికి, ముడి పెట్రోలియం, సహజవాయువు 2.56 శాతం, ఆహారేతర వస్తువులు 2.11 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ఖనిజాలు -1.08 శాతం, బొగ్గు -0.44 శాతం, విద్యుత్ -0.36 శాతం మేర క్షీణించాయి. కూరగాయల ధరలు 28.96 శాతం పడిపోయాయని గణాంకాలు వెల్లడించాయి. ఇంధనం, విద్యుత్ విభాగం జూలైలో 2.43 శాతం ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసింది, జూన్‌లో ఇది 2.65 శాతంగా ఉంది.






