- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Economy: భారత వృద్ధి అంచనాను 6.5 శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంక్
వినియోగం పటిష్టంగా ఉండటంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా కొనసాగుతుందని పేర్కొంది

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను 6.3 శాతం నుంచి 6.5 శాతానికి పెంచుతున్నట్టు ప్రపంచ బ్యాంకు మంగళవారం వెల్లడించింది. భారతీయ వస్తువులపై అమెరికా అధిక సుంకాలను విధించడంతో 2026-27లో వృద్ధి 6.3 శాతానికి పరిమితం అవుతుందని అభిప్రాయపడింది. అయితే, దేశంలో వినియోగం పటిష్టంగా ఉండటంతో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు తన దక్షిణాసియా ఔట్‌లుక్‌లో పేర్కొంది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విషయంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కార్యకలాపాలకు మద్దతు ఇస్తాయని భావిస్తున్నారు. అయితే, అమెరికాకు భారత్ చేసే వస్తువుల ఎగుమతుల్లో మూడింట ఒక వంతుపై 50 శాతం సుంకం విధించిన ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనాలను తగ్గించినట్టు నివేదిక తెలిపింది. ఇదే నివేదికలో 2025 ఏడాదికి గానూ దక్షిణాసియా వృద్ధి 6.6 శాతానికి చేరుకుంటుందని, 2026లో 5.8 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా భారత్‌పై అమెరికా సుంకాల ప్రభావం కీలక కారణమని నివేదిక వెల్లడించింది.






