Indian Economy: భారత జీడీపీ వృద్ధి అంచనాలను అప్‌గ్రేడ్ చేసిన ప్రపంచ బ్యాంకు

by S Gopi |

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికవ్యవస్థలలో భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధి రేటును కొనసాగిస్తుంది.

Indian Economy: భారత జీడీపీ వృద్ధి అంచనాలను అప్‌గ్రేడ్ చేసిన ప్రపంచ బ్యాంకు
X

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి అంచనాలను అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌లో అంచనా వేసిన 6.3 శాతంగా అంచనా వేసింది. ప్రస్తుతం దీన్ని 6.5 శాతానికి సవరిస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు మంగళవారం ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికవ్యవస్థలలో భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధి రేటును కొనసాగిస్తుంది. అమెరికాకు పంపే కొన్ని ఎగుమతులపై అధిక సుంకాలు ఉన్నప్పటికీ, ఇది భారత వస్తువుల ఎగుమతుల్లో దాదాపు 12 శాతం వాటాయే ఉంది. ప్రధానంగా దేశీయ డిమాండ్‌లో బలమైన ఊపు, గతంలో ఊహించిన దానికంటే అధిక స్థిరమైన ఎగుమతుల ద్వారా ప్రతికూల ప్రభావాలను భారత్ అధిగమిస్తుందని ప్రపంచ బ్యాంకు తన తాజా గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికలో పేర్కొంది.

ఇదే సమయంలో ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గితే భారత వృద్ధి అంచనా మరింత మెరుగుపడుతుందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. కొన్ని వాణిజ్య సమస్యలకు పరిష్కారం లభించడం, అమెరికా సుంకాలను పాక్షికంగా ఉపసంహరించుకుంటే, భారత ఎగుమతులు ఊహించిన దానికంటే వేగంగా పెరగవచ్చు. వాణిజ్య అడ్డంకులను తగ్గించడానికి దేశాల మధ్య చర్చలు మరింత విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా సహాయపడతాయి. తద్వారా వ్యాపార, వినియోగదారుల విశ్వాసం పెరుగుతుంది, దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో అధిక వ్యయం, అధిక పెట్టుబడులకు ఆస్కారం ఉంటుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.

Next Story