- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారానికి 80 గంటల పని కష్టమైనదేమీ కాదు: నేహా సురేశ్
శాన్‌ఫ్రాన్సిస్కోలో నివాసముంటున్న భారతీయ యువ వ్యాపారవేత్త నేహా సురేశ్ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నివాసముంటున్న భారతీయ యువ వ్యాపారవేత్త నేహా సురేశ్ (Neha Suresh) చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. "వారానికి 80 గంటల పని కష్టమైనదేమీ కాదు. రోజుకు 14 గంటలు కష్టపడకపోతే మీ కలలు సాకారం కావు. 9 నుంచి 5 పని గంటలతో మీరు ప్రపంచాన్ని మార్చే ఉత్పత్తిని తయారు చేయలేరు" అంటూ స్పష్టం చేశారు. నేహా ప్రస్తుతం “ఏప్రిల్” అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టార్టప్‌ను స్థాపించి దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆమె పోస్ట్‌లోని ఈ వ్యాఖ్యలు ప్రత్యేకించి యువతలో పెద్ద చర్చకు దారి తీశాయి.
ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆమెకు మద్దతుగా “కలలు నెరవేర్చాలంటే ఇంత కష్టమే” అంటుండగా, మరికొంతమంది ఇది "హస్టల్ కల్చర్"ను ప్రోత్సహించే తప్పుడు ఆలోచన అని విమర్శిస్తున్నారు. కాగా, గతంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా 70 గంటల పని వారాన్ని సూచించగా, అప్పట్లో కూడా ఇదే విధంగా చర్చ జరిగింది. ఇప్పుడు నేహా వ్యాఖ్యలు మరోసారి అదే సంభాషణకు దారితీశాయి.






