- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jobs: రికార్డు స్థాయిలో పెరిగిన జాబ్ అప్లికేషన్లు
జనవరి-మార్చి మధ్య రికార్డు స్థాయిలో 1.81 కోట్ల జాబ్ అప్లికేషన్లు వచ్చాయి. ఇది గతేడాది కంటే 30 శాతం అధికం.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో జాబ్ అప్లికేషన్లు వచ్చాయని ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అప్నా సోమవారం తన నివేదిక తెలిపింది. వాటిలో అత్యధికం మహిళల నుంచి రావడం విశేషం. అంతేకాకుండా అనువైన పని, అవకాశాల ఆధారంగా టైర్2, టైర్3 నగరాల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు 'ఇండియా ఎట్ వర్క్-క్యూ1 2025' పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం, ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య రికార్డు స్థాయిలో 1.81 కోట్ల జాబ్ అప్లికేషన్లు వచ్చాయి. ఇది గతేడాది కంటే 30 శాతం అధికం. దేశంలో పెరుగుతున్న ఆర్థిక వృద్ధి, వివిధ రంగాల్లో డిజిటల్ హైరింగ్ బూమ్‌ను ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. మొత్తం దరఖాస్తుల్లో అత్యధికంగా 62 లక్షలు మహిళలవే. గతేడాది కంటే 23 శాతం ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాల కోసం దర్ఖాస్తు చేసుకున్నారు. జమ్షెడ్‌పూర్, ఇండోర్ లాంటి టైర్2, టైర్3 పట్టణాల నుంచి ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. బీపీఓ, ఫైనాన్స్, హెచ్ఆర్ వంటి రంగాల్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళల తర్వాత అత్యధికంగా 66 లక్షల అప్లికేషన్లు ఫ్రెషర్ల నుంచి వచ్చాయని, గతేడాది కంటే 46 శాతం పెరిగాయని నివేదిక వివరించింది. ఎల్ఐసీ, పేటీఎం, ఢిలీవరి, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్రధాన కంపెనీలు లక్షకు పైగా ఓపెనింగ్స్ ప్రకటించడం, మెట్రోలను దాటి చిన్న పట్టణాల్లోనూ రిక్రూట్‌మెంట్‌లు నిర్వహించడం వంటి అంశాలు నియామకాలు పెరిగేందుకు దోహదపడ్డాయని అప్నా వ్యవస్థాపకుడు, సీఈఓ నిర్మిత్ పరిఖ్ చెప్పారు. మెట్రో నగరాల కంటే అత్యధికంగా టైర్2, టైర్3 నగరాల్లో 40 శాతానికి పైగా నియామకాలు జరిగాయని ఆయన తెలిపారు.






