- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PF: మీ జీతంలో పిఎఫ్ కట్ అవుతోందా.. అయితే మీకో గుడ్ న్యూస్.. 7 లక్షల ఇన్సూరెన్స్ మీ సొంతం ఎలాగంటే?
PF: ప్రభుత్వ ప్రైవేటు రంగంతో సంబంధం లేకుండా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందించే సౌకర్యమే ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్.

దిశ, వెబ్ డెస్క్: PF: ప్రభుత్వ ప్రైవేటు రంగంతో సంబంధం లేకుండా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందించే సౌకర్యమే ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్. 20 మంది ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థ కూడా ఈపీఎఫ్ లో నమోదు చేయించుకొని ఉద్యోగి పేరిట ఈపీఎఫ్ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. అయితే ఈ పిఎఫ్ అనేది కేవలం మీ పేరిట కొంత మొత్తంలో డబ్బులు పొదుపు చేసి మీ ఆర్థిక భరోసా కు తోడ్పడే సంస్థ మాత్రమే కాదు.
ఈపీఎఫ్ మీ పేరిట ఒక జీవిత బీమా పథకాన్ని కూడా నడుపుతోంది. ఇది మీ కష్టకాలంలో మీరు భౌతికంగా లేనప్పుడు మీ కుటుంబానికి ఆర్థికంగా ఆసరా కల్పించడమే ఈ స్కీం యొక్క లక్ష్యం. EDLI స్కీంకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబం ఆసరా కోల్పోతుంది. అలాంటివారికి ఈ ఇన్సూరెన్స్ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ బీమాకు గరిష్ట బీమా మొత్తం – రూ. 7 లక్షలుగా ఉంది. అంటే ఉద్యోగి మరణిస్తే 7 లక్షల రూపాయలు వారి కుటుంబానికి లేదా నామినీకి అందించాల్సి ఉంటుంది.
ఈ బీమా ను 12 నెలల పాటు ఉద్యోగి వేతనంలోని బేసిక్ ఆదాయం పైన లెక్కించిస్తారు. ఈ స్కీం కింద అతి తక్కువగా అతి తక్కువ మొత్తంగా రూ. 2.5 లక్షలు ఉండేది. ఈ స్కీం కింద అత్యధికంగా0 గరిష్టంగా రూ. 7 లక్షలు వరకూ ఉంటుంది. ఈ స్కీం కింద ఉద్యోగి నుంచి డబ్బు తీసుకోరు. యజమాని (Employer) ప్రతీ నెల Basic Wages + DA మీద 0.5% చెల్లిస్తాడు.
అంటే ఉద్యోగికి ఇది ఉచితం. EPF కింద నమోదు అయిన ప్రతి ఉద్యోగికి EDLI కవరేజ్ ఉంటుంది.ఇక ఈ పథకం క్లెయిం చేసుకోవాలి అంొటే Form 5(IF) ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్ల విషయానికి వస్తే మరణ ధృవీకరణ పత్రం, నామినీ ఐడెంటిటీ ప్రూఫ్, బ్యాంక్ డీటెయిల్స్ మొదలైనవి. కంపెనీ ద్వారా లేదా EPFO కార్యాలయం ద్వారా సమర్పించవచ్చు.






