ఏప్రిల్‌లో పెరిగిన హోల్‌సేల్ ద్రవ్యోల్బణం.. 8.3 శాతానికి చేరిన ధరల సూచీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-14 12:52:18  IST  )

ఏప్రిల్ 2026లో భారతదేశ టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) 8.3 శాతంగా నమోదైంది.

ఏప్రిల్‌లో పెరిగిన హోల్‌సేల్ ద్రవ్యోల్బణం.. 8.3 శాతానికి చేరిన ధరల సూచీ
X

దిశ, వెబ్‌‌‌డెస్క్: దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం (Wholesale Price Index - WPI) భారీగా పెరిగింది. 2026 ఏప్రిల్ నెలలో వార్షిక టోకు ద్రవ్యోల్బణ రేటు 8.3 శాతంగా నమోదైందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2025 ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ప్రభావం చూపింది. దీంతో రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. ప్రాథమిక లోహాలైన ఉక్కు, అల్యూమినియం వంటి లోహాల ధరలు ఆకాశాన్నంటాయి. ఆహారేతర వస్తువులు, పారిశ్రామిక ముడిసరుకుల వాల్యూ మరింత ప్రియం అయిట్లుగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాలను వెల్లడించింది.

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Next Story