- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Personal Finance: మీరు ఉద్యోగం చేస్తున్నారా? అయితే ఈ రెండు స్కీముల గురించి తప్పకుండా తెలుసుకోవల్సిందే..!!
Personal Finance: రిటైర్మెంట్ తర్వాత జీవితం గురించి ప్రతిఒక్కరి మనసులో ఆందోళన ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: Personal Finance: రిటైర్మెంట్ తర్వాత జీవితం గురించి ప్రతిఒక్కరి మనసులో ఆందోళన ఉంటుంది. నెలలవారీ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందన్న ప్రశ్న వేధిస్తుంది. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని ఎన్పీఎస్ ట్రస్ట్ రెండు పెన్షన్ స్కీములైన నేషనల్ పెన్షన్ స్కీమ్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లను విశ్లేషించే కొత్త సాధానాన్ని ప్రారంభించింది. ఈ రెండు స్కీముల్లో ఎందులోనైనా పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ తర్వాత మీరు ఎంత పెన్షన్, ఏక మొత్తాన్ని పొందవచ్చో తెలియజేస్తుంది.
స్థిరనెలవారీ పెన్షన్ కోరకునే, మార్కెట్ రిస్క్ నుంచి దూరంగా ఉండాలనుకునే ఉద్యోగుల కోసం యూపీఎస్ రూపొందించింది. మరోవైపు ఎన్పీఎస్ అనేది మార్కెట్ లింక్డ్ స్కీమ్. ఇందులో పొందే ప్రయోజనాలు పూర్తిగా పెట్టుబడిపై రాబడిపై ఆధారపడి ఉంటాయి. యూపీఎస్ నెలలవారీ పెన్షన్ స్థిరంగా ఉంటుంది. కానీ మొత్తం రాబడి లిమిట్ గా ఉంటుంది. అయితే ఎన్పీఎస్ లో రిస్క్ తోపాటు రాబడి కూడా ఎక్కువగా ఉంటుంది.
మీ వయస్సు, ప్రస్తుత జీతం, ఉద్యోగ కాలపరిమితి, వార్షిక జీతం పెరుగుదల, డీఏ పెరుగుదల అంచనా వేసిన రాబడి ఆధారంగా ఈ రెండు స్కీముల ఫలితాలను ఒకేసారి మీకు చూపిస్తుంది. ఊదాహరణగా చెప్పుకుంటే ఒక ఉద్యోగి 35ఏళ్ల వయస్సులో పనిచేస్తూ 60ఏళ్ల వయస్సులో రిటైర్మెంట్ అవుతే యూపీఎస్ లో అతను దాదాపు రూ. 37, 626 స్థిర పెన్షన్ పొందుతాడు. అయితే ఎన్పీఎస్ లో ఈ పెన్షన్ 8శాతం రాబడితో రూ. 55, 295 వరకు, 12శాతంతో రూ. 1,05,951 వరకు ఉంటుంది. ఎన్పీఎస్ లో రాబడిని బట్టి ఏకమొత్తం జీవితకాల ప్రయోజనం కూడా చాలా రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
ఈ కాలిక్యులేటర్ కేవలం అంచనా మాత్రమే. నిజజీవిత జీతం పెరుగుదల, ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ కదలికలు ఈ అంచనాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఏదైనా స్కీము ఎంచుకునే ముందు మీరు మీ అవసరాలను రిస్క్ టాలరెన్స్ ను అర్థం చేసుకోవాలి. ఎన్పీఎస్ ట్రస్ట్ నుంచి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కాలిక్యులేటర్ రిటైర్మెంట్ ప్రణాళిక గురించి ఇప్పటికీ గందరగోళంలో ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సాధనం వారికి స్పష్టమైన పోలిక ఇవ్వడం ద్వారా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.






