Whatsapp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. త్వరలో వాయిస్ మెయిల్ పంపే సదుపాయం

by S Gopi |   (  Updated:2025-08-22 13:28:54  IST  )

వాట్సాప్ కాల్ చేసినప్పుడు అటువైపు నుంచి సమాధానం రాకపోతే తక్షణ వాయిస్ మెసేజ్ పంపే ఫీచర్‌..

Whatsapp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. త్వరలో వాయిస్ మెయిల్ పంపే సదుపాయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ కాలింగ్ విషయంలో ఇబ్బందులను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దానికోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్టు సమాచారం. ఎవరైనా వాట్సాప్ కాల్ చేసినప్పుడు అటువైపు నుంచి సమాధానం రాకపోతే తక్షణ వాయిస్ మెసేజ్ పంపే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ఇది ఆండ్రాయిడ్ లేటెస్ట్ బీటా వెర్షన్ 2.25.23.21 వాడుతున్న కొంతమంది యూజర్లకు ఇది అందుబాటులో ఉంది. ప్రముఖ టెక్ న్యూస్ పోర్టల్ డబ్ల్యూఏబీటాఇన్ఫో ప్రకారం, ఏదైనా కాల్ అటెండ్ చేయలేకపోతే కాల్స్ స్క్రీన్ కింద భాగంలో రికార్డ్ వాయిస్ మెసేజ్ ఆప్షన్ వస్తుంది. దానిపై ట్యాప్ చేయగానే యూజర్లు తమ వాయిస్ మెసేజ్ రికార్డు చేసి పంపించే వీలుంటుంది. తిరిగి పదేపదే కాల్స్ చేసే పనిలేకుండా తక్షణం మెసేజ్ పంపించేందుకు ఇది సులభమైన మార్గంగా ఉండనుంది. ఇప్పటికే చాట్ విండోలో వాయిస్ నోట్స్ పంప్చే ఫీచర్ ఉన్నప్పటికీ, కొత్త ఫీచర్ తక్షణం ఏదైనా ముఖ్యమైన మెసేజ్ పంపించాల్సి ఉన్న సమయంలో రిమైండర్‌లా పనిచేస్తుందని వాట్సాప్ చెబుతోంది. దీనివల్ల యూజర్లు మిస్డ్ కాల్, వాయిస్ మెసేజ్ రెండూ చూడగలిగేలా ఈ ఫీచర్ ఉంటుంది.

Next Story