- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్‌లో సూపర్ ఫీచర్.. ఫోన్ నెంబర్ అవసరం లేకుండా సేవలు
వాట్సాప్‌లో సరికొత్త ప్రైవసీ ఫీచర్.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండా కేవలం 'యూజర్ నేమ్'తోనే చాటింగ్: ఈ వారం నుంచే రిజర్వేషన్ షురూ!

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన వినియోగదారుల ప్రైవసీని మరింత బలోపేతం చేస్తూ ఒక విప్లవాత్మక ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ఇకపై వాట్సాప్‌లో ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి మీ వ్యక్తిగత ఫోన్ నెంబర్ షేర్ చేయాల్సిన అవసరం లేకుండా కొత్త సేవలను అందించనుంది. దీని కోసం ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ తరహాలోనే ఒక ప్రత్యేకమైన 'యూజర్ నేమ్' (Username) సెట్ చేసుకునే సదుపాయాన్ని తీసుకువస్తున్నట్లు వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది.
ఈ వారం నుంచే మీ యూజర్‌నేమ్
ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించి వాట్సాప్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వివరాలను వెల్లడించింది. ఈ వారం నుంచే యూజర్లు తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది చివర్లో ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
యూజర్‌నేమ్ ఎలా సెట్ చేసుకోవాలి?
ఈ ఫీచర్‌ను పొందడానికి యూజర్లు కేవలం కొన్ని సెకన్ల పాటు ఈ కింది స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది:
ముందుగా మీ మొబైల్‌లో వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి.
వాట్సాప్ ఓపెన్ చేసి Settings లోకి వెళ్ళండి.
అక్కడ Account పై క్లిక్ చేసి.. Username అనే ఆప్షన్‌ను ఎంచుకుని మీకు నచ్చిన పేరును రిజర్వ్ చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే తెలియని వ్యక్తులకు, బిజినెస్ అవసరాల కోసం ఫోన్ నంబర్లు ఇవ్వకుండా, కేవలం యూజర్‌నేమ్ ద్వారానే చాట్ చేసుకునే వీలు కలుగుతుంది. ఇది యూజర్ల ప్రైవసీకి పెద్దపీట వేస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.






