వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్: ఇక యాప్‌లోనే మొబైల్ రీఛార్జ్ కూడా..

by Naga Rani Yarlagadda |

ఇకపై వాట్సప్ లోనే మొబైల్ రీఛార్జ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. పే యూ భాగస్వామ్యంతో వాట్సప్ ఈ ఫీచర్ తీసుకొచ్చింది.

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్: ఇక యాప్‌లోనే మొబైల్ రీఛార్జ్ కూడా..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ (WhatsApp) తన భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త ఇన్-యాప్ మొబైల్ రీఛార్జ్ ఫీచర్‌ను గురువారం (ఏప్రిల్ 23, 2026) అధికారికంగా లాంచ్ చేసింది. ఇకపై యూజర్లు తమ మొబైల్ రీఛార్జ్ కోసం గూగుల్ పే, ఫోన్ పే వంటి ఇతర యాప్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా వాట్సాప్ నుంచే రీఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ సేవలను అందించడానికి వాట్సాప్ ప్రముఖ పేమెంట్ గేట్‌వే 'పే యూ' (PayU) తో చేతులు కలిపింది. రిలయన్స్ జియో (Jio), భారతీ ఎయిర్‌టెల్ (Airtel), మరియు వొడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ సేవలను వాడుకోవచ్చు. పేమెంట్స్, రీఛార్జ్ సేవలను సులభతరం చేసేందుకు వాట్సాప్ హోమ్ స్క్రీన్‌పై ప్రత్యేకంగా రూపాయి (₹) గుర్తుతో ఒక ఐకాన్‌ను ప్రవేశపెట్టింది. చాట్ బాక్స్ వదలకుండానే సొంత నంబర్‌కు లేదా స్నేహితులు, కుటుంబ సభ్యుల నంబర్లకు రీఛార్జ్ చేయవచ్చు. యూపీఐ (UPI)తో పాటు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా పేమెంట్ చేసే వెసులుబాటు ఉంది. ఇదే ఐకాన్ ద్వారా మెట్రో టికెట్లు బుక్ చేసుకోవడం, కరెంట్ బిల్లులు చెల్లించడం వంటి పనులు కూడా చేయవచ్చు.

స్టెప్ బై స్టెప్: రీఛార్జ్ చేయడం ఇలా..

వాట్సాప్ ఓపెన్ చేసి టాప్ రైట్ లేదా హోమ్ స్క్రీన్‌పై ఉన్న ₹ ఐకాన్ పై క్లిక్ చేయండి.

అందులో 'Mobile Prepaid Recharge' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

కాంటాక్ట్ లిస్ట్ నుంచి నంబర్‌ను సెలెక్ట్ చేయండి లేదా కొత్త నంబర్ ఎంటర్ చేయండి.

ఆటోమేటిక్‌గా ఆపరేటర్ వివరాలు వస్తాయి (సరికాకపోతే మార్చుకోవచ్చు).

అందుబాటులో ఉన్న వివిధ ప్లాన్లను చూసి, మీకు నచ్చిన దాన్ని ఎంచుకోండి.

మీ యూపిఐ పిన్ ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయండి. వెంటనే రీఛార్జ్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

Next Story