Whatsapp: ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్ తరహాలో వాట్సాప్‌లోనూ కవర్ ఫోటో ఫీచర్

by S Gopi |

ప్రొఫైల్ కస్టమైజేషన్‌లో భాగంగా ఈ సదుపాయాన్ని సాధారణ కస్టమర్లకు కూడా అందించాలని భావిస్తున్నట్టు వాట్సాప్ పేర్కొంది.

Whatsapp: ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్ తరహాలో వాట్సాప్‌లోనూ కవర్ ఫోటో ఫీచర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో ఉంది. సాధారణంగా ప్రొఫైల్, కవర్ ఫోటోలు సోషల్ నెట్‌వర్కింగ్ అకౌంట్ల తీరులో కీలక పాత్ర పోషిస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫేస్‌బుక్, లింక్డ్ఇన్ తరహాలో కవర్‌ఫోటో ఫీచర్ అందించడానికి సన్నాహాలు చేస్తోంది. కవర్ ఫోటోలు ఇప్పటివరకు వాట్సాప్ బిజినెస్ అకౌంట్లకు మాత్రమే ఉన్నాయి, దీన్ని ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెచ్చే చర్యలు తీసుకుంటున్నట్టు వాట్సాప్ తెలిపింది. ప్రొఫైల్ కస్టమైజేషన్‌లో భాగంగా ఈ సదుపాయాన్ని సాధారణ కస్టమర్లకు కూడా అందించాలని భావిస్తున్నట్టు వాట్సాప్ పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రక్రియను అభివృద్ధి చేస్తున్నామని, త్వరలో కస్టమర్లకు అందిస్తామని స్పష్టం చేసింది. అయితే, ఎప్పటికీ అందుబాటులోకి వస్తుందనే విషయం వాట్సాప్ చెప్పలేదు. భవిష్యత్తులో వాట్సాప్ అప్‌డేట్‌లో దీన్ని తీసుకొస్తామని, కొత్త ఫీచర్‌ను ఉపయోగించి కస్టమర్లు తమ ప్రొఫైల్ సెట్టింగ్స్ ద్వారా నచ్చిన ఫోటోను కవర్ ఫోటోగా పెట్టుకోవచ్చని వాట్సాప్ తన బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. దీనికి ప్రత్యేకమైన ప్రైవసీ సెట్టింగ్ కూడా ఉంటుందని, కవర్ ఫోటోను ఎవరు చూడాలనే ఆప్షన్ కూడా ఇవ్వనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రొఫైల్ ఫోటోకు ఉన్నట్టుగానే మై కాంటాక్ట్స్, ఎవ్రీవన్, నోబడీ లాంటి ఎంపికలుంటాయి.

Next Story