మెటా సంచలన నిర్ణయం.. వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా 'కునాల్ షా' నియామకం

by Malleboina Mahesh |

వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా క్రెడ్ (CRED) వ్యవస్థాపకుడు కునాల్ షా నియామకం.. క్రెడ్ సంస్థలో రూ.8,550 కోట్ల పెట్టుబడి పెట్టిన మెటా.

మెటా సంచలన నిర్ణయం.. వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా కునాల్ షా నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta), తమ గ్లోబల్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ 'వాట్సాప్' (WhatsApp) నాయకత్వ బాధ్యతలలో చరిత్రాత్మక మార్పును తీసుకొచ్చింది. భారతీయ ప్రముఖ ఫిన్‌టెక్ స్టార్టప్ 'క్రెడ్' (CRED) వ్యవస్థాపకుడు కునాల్ షా (Kunal Shah) ను వాట్సాప్ కొత్త గ్లోబల్ హెడ్‌గా నియమిస్తున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో విల్ క్యాత్‌కార్ట్ (Will Cathcart) స్థానంలో కునాల్ షా బాధ్యతలు స్వీకరించనున్నారు. గత ఏడేళ్లుగా వాట్సాప్‌ను విజయవంతంగా నడిపించిన విల్ క్యాత్‌కార్ట్, ఇకపై మెటాలోనే ఉంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సరికొత్త ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేయనున్నారు.

ఈ నియామకం తో పాటు, కునాల్ షాకు చెందిన 'క్రెడ్' (CRED) సంస్థలో మెటా సుమారు 900 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8,550 కోట్లు) భారీ పెట్టుబడిని కూడా ప్రకటించింది. దీనివల్ల క్రెడ్‌ సంస్థలో మెటాకు 20 శాతం మైనారిటీ వాటా లభించనుంది. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగానే అతిపెద్ద మార్కెట్ అయిన భారతదేశం నుండి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ బిల్డర్, అంతర్జాతీయ దృక్పథం కలిగిన పారిశ్రామికవేత్తను ఎంచుకోవాలనే ఉద్దేశంతోనే మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీ క్రిస్ కాక్స్ ఈ ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

Next Story