Gold Rates: మరోసారి షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

by Jakkula.Mamatha |

మహిళలకు బంగారం ధరలు మరోసారి షాకిచ్చాయి. నేడు(ఫిబ్రవరి 14) బంగారం ధరలు పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,55,780 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.1,970 పెరిగి రూ. 1,57,750గా ఉంది.

Gold Rates: మరోసారి షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: భారత దేశంలో గోల్డ్‌కి ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మూడు రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో నేడు(ఫిబ్రవరి 14) బంగారం ధరలు పెరిగి మరోసారి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,55,780 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.1,970 పెరిగి రూ. 1,57,750గా ఉంది. అలాగే నిన్న రూ.1,42,800 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.1,800 పెరిగి రూ.1,44,600 గా ఉంది. ఇక అటు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ కిలో రూ. 2,80,000గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,44,600

24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,57,750

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,44,600

24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,57,750

Next Story