- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Google AI Mode: గూగుల్ సెర్చ్ ఏఐ మోడ్ వచ్చేసింది
ప్రస్తుతం ఉన్న సెర్చ్ ఫలితాలతో పోలిస్తే మరింత ఖచ్చితమైన సమాచారాన్ని అందించేలా రూపొందించినట్టు పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్ ల్యాబ్స్ ప్రయోగంలో భాగంగా అమెరికాలో ఏఐ మోడ్‌ను ఇటీవల ప్రవేశపెట్టింది. ఇప్పుడు దీన్ని భారత్‌లోనూ ప్రారంభించింది. ఈ సాధనం ద్వారా వినియోగదారులు సంక్లిష్టమైన, వివరణాత్మక ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే వీలు కల్పిస్తుంది. కంపెనీ వివరాల ప్రకారం, ఈ కొత్త టూల్ అంశాల వారీగా ప్రశ్నలకు సమాధానం వెతుకుతుంది, ప్రస్తుతం ఉన్న సెర్చ్ ఫలితాలతో పోలిస్తే మరింత ఖచ్చితమైన సమాచారాన్ని అందించేలా రూపొందించినట్టు పేర్కొంది. ఏఐ మోడ్ అనేది గూగుల్ సెర్చ్‌లో అంతర్భాగమైన అధునాతన సెర్చ్ ఫీచెర్. ఇది సాంప్రదాయ సెర్చ్ పద్ధతి కంటే మరింత సంక్లిష్టమైన, లేయర్డ్ స్థాయిలో ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఇది గూగుల్ జెమిని 2.5 ఏఐ మోడల్ కస్టమ్ వెర్షన్‌పై పనిచేస్తుంది.
గూగుల్ ఏఐ మోడ్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లు
సంక్లిష్ట ప్రశ్నలకు అధునాతన సమాధానాలు
గూగుల్ ఏఐ మోడ్ సాంప్రదాయకంగా అనేక శోధనలు అవసరమయ్యే ప్రశ్నలను ఇది సులభంగా హ్యాండిల్ చేస్తుంది. దీన్ని క్వైరీ ఫ్యాన్ అవుట్ టెక్నిక్ ఆధారంగా రూపొందించారు. అడిగిన ప్రశ్నను చిన్న చిన్న అంశాలుగా విభజించి, ఒకేసారి అనేక శోధనలను నిర్వహిస్తుంది. దీనివల్ల ఖచ్చితమైన, వివరణాత్మక సమాధానాలను ఇస్తుంది. ఏఐ మోడ్ ద్వారా రియల్ టైమ్ డేటా, నాలెడ్జ్ గ్రాఫ్ నుంచి సమాచారాన్ని అందిస్తుంది. లక్షల్లో ఉండే ఉత్పత్తుల గురించి షాపింగ్ సంబంధిత సమాచారాన్ని కూడా సేకరించవచ్చు. దీనర్థం, ఏదైనా మాట్లాడటం, రాయడం లేదంటే ఫోటోలను అప్‌లోడ్ చేయడం ద్వారా సేర్చ్ చేయవచ్చు.
ఫాలో-అప్ ప్రశ్నలు
అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇవ్వకుండా, ఈ ఏఐ మోడ్ వినియోగదారులకు దానికి కొనసాగింపుగా ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఉదాహరణకు, పిల్లల కోసం ఇండోర్ గేమ్స్ గురించి అడిగిన తర్వాత కొనసాగింపుగా.. అందులో ఏది పిల్లలు ఒంటరిగా ఆడుకోవచ్చు ' అని మరో కొత్త ప్రశ్నను అడగొచ్చు.
మల్టీమోడల్ ఇన్‌పుట్ ఆపషన్స్
ఏఐ మోడ్ అడిగిన వాటికి మాత్రమే బదులిచ్చి ఆగిపోదు. యూజర్లు మైక్రోఫోన్ ద్వారా ఆడియోలో మాట్లాడవచ్చు లేదా గూగుల్ లెన్స్‌ని ఉపయోగించి ఫోటో ద్వారా సెర్చ్ చేయవచ్చు. ఉదాహరణకు, ఎవరైనా ఒక మొక్క గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, వారు ఆ ఫోటోను అప్‌లోడ్ చేసి కనుక్కోవచ్చు
డీపర్ వెబ్ ఇంటిగ్రేషన్
నాలెడ్జ్ గ్రాఫ్, ప్రోడక్ట్ డేటాబేస్, రియల్-టైమ్ సమాచారంతో సహా దాని ప్రస్తుత వెబ్ మౌలిక సదుపాయాలతో అనుసంధానం చేశారు. స్టాండలోన్ చాట్‌బాట్‌ల మాదిరిగా కాకుండా, ఇది వెబ్ కంటెంట్, గూగుల్‌కు చెందిన ఇండెక్స్డ్ డేటా నుంచి సమాచారం సేకరిస్తుంది.
ఏఐ మోడ్‌ను ఎలా ఉపయోగించాలి
* ఏఐ మోడ్ వాడేందుకు ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్‌లలో గూగుల్ యాప్ ద్వారా ల్యాబ్స్ బ్రౌజర్‌ను ఎంచుకోవాలి.
* అందులో ఎడమవైపు ల్యాబ్స్(బీకర్ గుర్తు) సింబల్‌పై నొక్కాలి.
* 'ట్రైన్ ఏఐ మోడ్' అనే ఆప్షన్ ఎంచుకోగానే వాయిస్, టెక్స్ట్, ఫోటోల ఇన్‌పుట్ ఆప్షన్ వస్తుంది.
* అందులో కావాల్సిన సమాచారం కోసం సెర్చ్ చేయవచ్చు.






