- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Half Burnt Currency: మీ కరెన్సీ నోటు మంటల్లో కాలిందా? ఈ నోటును ఎక్స్చేంజ్ చేసుకొవచ్చా? RBI నిబంధనలు ఏం చెబుతున్నాయి?
Half Burnt Currency: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ పేరు ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: Half Burnt Currency: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ పేరు ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఆయన ప్రభుత్వ బంగ్లాలోని ఒక గదిలో మొత్తంలో నగదు దొరికిందన్న వార్తలు హాట్ టాపిగ్గా మారాయి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి ఓ వీడియో వైరల్ అయ్యింది. అక్కడి నుంచి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈవీడియోను ఢిల్లీ పోలీసులు చిత్రీకరించినట్లు చెబుతున్నారు. అయితే సుప్రీంకోర్టు ఈ వీడియోను విడుదల చేసింది. వీడియోలో కరెన్సీ నోట్ల కట్టలు కాలిపోతున్నట్లు చూడవచ్చు.
అయితే జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసం నుంచి డబ్బు రికవరీ జరిగిందన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయ్ భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు నివేదిక సమర్పించిన సమయంలో ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈఘటనకు సంబంధించిన ఆధారాలు, సమాచారాన్ని సేకరించడానికి జస్టిస్ ఉపాధ్యాయ్ అంతర్గత దర్యాప్తు ప్రక్రియను ప్రారంభించారు. అగ్నిమాపకశాఖ, పోలీసులు సహా సంబంధిత అధికారులందరితో మాట్లాడిన అనంతరం ఈ నివేదికను ప్రధాన న్యాయమూర్తికి సమర్పించారు. సుప్రీం కొలీజియం ఈ రిపోర్టును పరిశీలించిన అనంతరం ఏదైనా చర్య తీసుకుంటుంది.
వీటన్నింటి మధ్య సగం కాలిపోయిన నోట్లను మార్చుకోవచ్చా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల మనస్సుల్లో తలెత్తుతున్నాయి. బ్యాంకు సగం కాలిపోయిన నోట్లను మార్పిడి చేస్తుందా ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. నిజానికి ఆర్బిఐ నోట్ల మార్పిడికి కొన్ని నియామాలను రూపొందించింది. మీరు సమీపంలోని బ్యాంకు లేదా ఆర్బిఐ కార్యాలయానికి వెళ్లి మురికి, చెరిగిన లేదా దెబ్బతిన్న నోట్లను మార్పిడి చేసుకోవచ్చు. అయితే నోట్లు మొత్తం విలువ 5000 మించకూడదు. 5వేల కంటే ఎక్కువగా ఉంటే దానిపై ఛార్జీ విధిస్తారు.
బ్యాంకు నిబంధనల ప్రకారం ఒక నోటు బాగా కాలిపోతే..దానిని మార్చలేము. నోటులో 50శాతం కంటే ఎక్కువ కాలిపోయినా లేదా దెబ్బతిన్నా దానిని మార్పిడి చేసుకునేందుకు వీలు ఉండదు. కానీ మీరు దానిని ఆర్బిఐ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ ఉన్న అధికారిని దీని గురించి అభ్యర్థించవచ్చు. అధికారికి అది సముచితమనిపిస్తే దర్యాప్తు చేసిన తర్వాత అతను ఆ నోటును మార్పిడి చేస్తాడు.






