Petrol Diesel prices(14-02-2026): నేడు పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2026-02-14 02:14:06  IST  )

పెట్రోల్, డీజిల్ ధరలు నిన్నటి ధరలతో పోల్చితే విశాఖపట్నం, విజయవాడలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు(ఫిబ్రవరి 14) ధరల్లో ఏమైనా మార్పులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Petrol Diesel prices(14-02-2026): నేడు పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ రీసెంట్‌గా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాహనదారులు ఆందోళనకు గురి అయ్యారు. కానీ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఉండదని సృష్టం చేసింది. ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. దీంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ నెల(ఫిబ్రవరి)లో అయినా ధరల్లో మార్పులు జరిగి రేట్లు తగ్గుతాయని వాహనదారులు ఆశ పడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఇదిలా ఉంటే.. నిన్నటి ధరలతో పోల్చితే విశాఖపట్నం, విజయవాడలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు(ఫిబ్రవరి 14) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర: రూ. 107.46

లీటర్ డీజిల్ ధర రూ. 95.70

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర: రూ.108.45

లీటర్ డీజిల్ ధర రూ.96.32

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర: రూ.109.63

లీటర్ డీజిల్ ధర రూ. 97.47

Next Story