- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LPG GAS PRICE TODAY: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
హైదరాబాద్‌లో ఈరోజు(శనివారం) 14.2 కిలోల ప్రతి సిలిండర్‌కు LPG ధర రూ.905.00.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఈరోజు(శనివారం) 14.2 కిలోల ప్రతి సిలిండర్‌కు LPG ధర రూ.905.00. సబ్సిడీ మరియు సబ్సిడీ లేని సిలిండర్‌లకు ధర ఒకేలా ఉంటుంది. LPG స్వచ్ఛమైన ఇంధనం కాబట్టి దేశీయ మరియు వాణిజ్య వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ.111 పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1691.50కి చేరుకుంది.
ఇతర నగరాలతో పోల్చి చూస్తే వరంగల్‌లోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ కన్నా కూడా వరంగల్, హైదరాబాద్‌లోనే గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో ఇవాళ(ఫిబ్రవరి 21) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్: రూ.905
వరంగల్: రూ. 924
విశాఖపట్నం: రూ. 861
విజయవాడ: రూ.877.50
గుంటూరు: రూ. 877.50






