- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LPG Gas Price Today: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. రీసెంట్‌గా గ్యాస్ ధరలు సామాన్య ప్రజలకు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ఉద్రిక్తతల(ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం) కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశీయ వంట గ్యాస్(LPG) సిలిండర్ ధరలను పెంచాయి. ఈ తరుణంలో ఇంట్లో ఉపయోగించే సాధారణ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 60 పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ. 965కు చేరుకుంది. హోటల్స్, రెస్టారెంట్లు వాడే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 115 పెరిగింది. దీంతో కొన్ని హోటల్స్ మూసి వేసుకునే పరిస్థితి నెలకొంది. ఇతర నగరాలతో పోల్చి చూస్తే వరంగల్‌లోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ(మార్చి 27) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగారల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్: రూ.965.00
వరంగల్: రూ. 984.00
విశాఖపట్నం: రూ. 921.00
విజయవాడ: రూ. 937.50
గుంటూరు: రూ. 937.50






