LPG Gas Price Today: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?

by Jakkula.Mamatha |

మార్చి 19వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

LPG Gas Price Today: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. రీసెంట్‌గా గ్యాస్ ధరలు సామాన్య ప్రజలకు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ఉద్రిక్తతల (ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం) కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశీయ వంట గ్యాస్(LPG) సిలిండర్ ధరలను రూ. 60 పెంచాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ. 965కు చేరుకుంది. వాణిజ్య సిలిండర్‌పై రూ. 115 పెరిగింది. దీంతో కొన్ని హోటల్స్ ముసివేసుకునే పరిస్థితి నెలకొంది. ఇతర నగరాలతో పోల్చి చూస్తే వరంగల్‌లోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ(మార్చి 19) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ. 965

వరంగల్: రూ. 984

విశాఖపట్నం: రూ. 921

విజయవాడ: రూ. 937.50

గుంటూరు: రూ. 937.50

Next Story