- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CAIT: ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్‌కు రూ. రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం
ఢిల్లీలోనే 4.8 లక్షల వివాహ వేడుకలు జరుగుతాయని, తద్వారా వ్యాపార వర్గాలకు రూ. 1.8 లక్షల కోట్ల ఆదాయం అంచనా వేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్‌కు భారీ వ్యాపారం జరుగుతున్న రిటైల్ వర్గాలు భావిస్తున్నాయి. నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్ 45 రోజుల పాటు ఉండనుంది. ఈ సమయంలో 46 లక్షల వివాహాలు జరుగుతాయని, ఫలితంగా రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని వర్తకుల సంఘం సీఏఐటీ రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలోనే 4.8 లక్షల వివాహ వేడుకలు జరుగుతాయని, తద్వారా వ్యాపార వర్గాలకు రూ. 1.8 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే వివాహాల సంఖ్య దాదాపుగా అంతే ఉన్నప్పటికీ, ప్రతి వివాహానికి అయ్యే ఖర్చు పెరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) పరిశోధన విభాగం తెలిపింది.
దీని గురించి సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ఈ పెరుగుదల ఎక్కువ ఆదాయం చేతిలో ఉండటం, ఆభరణాల ధరలు ఖరీదు కావడం, రికార్డు స్థాయిలో పండుగ సీజన్ జరిగిన తర్వాత పెరిగిన వినియోగదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. 2024లో మొత్తం 48 లక్షల వివాహాలు జరగ్గా, రూ.5.90 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. అంతకుముందు 2023లో 38 లక్షల వివాహాలు, రూ.4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్టు సీఏఐటీ పెర్కొంది. ఈ వివాహ వేడుకల సందర్భంగా జరిగే కొనుగోళ్లలో 70 శాతానికి పైగా ఇప్పుడు స్వదేశీ ఉత్పత్తులు, వస్తువులే వాడటం విశేషం. అందులో దుస్తులు, ఆభరణాలు, అలంకరణ, పాత్రలు, క్యాటరింగ్ వస్తువులు కూడా ఉన్నాయి.






