- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Volkswagen: రూ. 3 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఫోక్స్‌వ్యాగన్
ఇందులో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, లాయల్టీ ప్రోత్సాహకాలు ఉన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా దీపావళి పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ముఖ్యంగా కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని టిగ్వాన్, టైగన్, వర్చస్ మోడళ్ల కోసం పండుగ సీజన్ ఆఫర్లు తీసుకొచ్చింది. ఇందులో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, లాయల్టీ ప్రోత్సాహకాలు ఉన్నాయి. నగరం, కారు మోడల్‌ను బట్టి డిస్కౌంట్లలో మార్పులు ఉంటాయని, కస్టమర్లు పూర్తి వివరాల కోసం స్థానిక డీలర్‌షిప్‌ను సంప్రదించాలని కంపెనీ తెలిపింది. కంపెనీ అధికారిక వివరాల ప్రకారం, ప్రస్తుతం రూ. 49 లక్షల(ఎక్స్‌షోరూమ్) ధరతో లభిస్తున్న టిగ్వాన్ ఆర్ లైన్ మోడల్‌పై రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఆరు నెలల క్రితం పూర్తిగా బిల్ట్-అప్ దిగుమతిగా భారత మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ఇటీవల జీఎస్టీ పన్ను తగ్గింపు తర్వాత రూ. 3.27 లక్షలు తగ్గింది. ఇప్పుడు మరోసారి దీపావళి సందర్భంగా డిస్కౌంట్ ప్రకటించడంతో మొత్తంగా కస్టమర్లు రూ. 6 లక్షల వరకు ప్రయోజనం పొందుతారు.
మిడ్-రేంజ్ ఎస్‌యూవీ మోడల్ టైగన్ కారుపైనా కంపెనీ రూ. 2 లక్షల వరకు తగ్గింపు ఇస్తోంది. అయితే, 2024 స్టాక్‌లోని కార్లకు అధిక డిస్కౌంట్ లభిస్తుండగా, 2025 ట్రిమ్‌పై రూ. లక్ష పైనా తగ్గింపు ఆఫర్ చేస్తోంది. వర్చస్ కారుపై అత్యధికంగా రూ. 1.56 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. వేరియంట్‌ని బట్టి డిస్కౌంట్ వేరుగా వర్తిస్తుంది. అన్ని కార్ల ధరలు ఎక్స్‌షోరూమ్ ధరలపై వర్తిస్తుంది. ఆఫర్లు నగరాలను బట్టి, స్టాక్ లభ్యతను బట్టి మారుతాయని కంపెనీ వెల్లడించింది.






