- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TRAI: 9.40 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా
by S Gopi |
దిగ్గజ భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ఎప్పటిలాగే కొత్త సబ్‌స్క్రైబర్లను సాధించాయి.

X
దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాది డిసెంబర్‌లో ప్రైవేట్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా భారీగా సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఇదే సమయంలో దిగ్గజ భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ఎప్పటిలాగే కొత్త సబ్‌స్క్రైబర్లను సాధించాయి. మంగళవారం టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం, సమీక్షించిన నెలలో ఎయిర్‌టెల్ కొత్తగా 54.3 లక్షల మంది కస్టమర్లను చేర్చుకోగా, జియో 29.6 లక్షల మందిని సంపాదించుకుంది. ఇక, వొడాఫోన్ ఐడియా 9.4 లక్షల మందిని, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ 2.1 లక్షల మంది వినియోగదారులను కోల్పోయాయి. దీంతో మొత్తం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2025, డిసెంబర్ చివరి నాటికి 125.87 కోట్లకు పెరిగింది. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 71.3 కోట్ల నుంచి 72 కోట్లకు పెరగ్గా, గ్రామీణ ప్రాంతాల్లో సబ్‌స్క్రైబర్లు 53.72 కోట్ల నుంచి 53.86 కోట్లకు పెరిగారు.
Next Story






