- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెస్లాకు పోటీగా కొత్త కార్లు... 440 కిమీ మైలేజ్.. ధర ఎంతంటే ?
భారత మార్కెట్లోకి.. అనేక రకాల వాహనాలు వస్తున్నాయి. వినియోగదారులు రకరకాల కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి

దిశ, వెబ్ డెస్క్: భారత మార్కెట్లోకి.. అనేక రకాల వాహనాలు వస్తున్నాయి. వినియోగదారులు రకరకాల కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో... కంపెనీలు కూడా మంచి మోడల్స్ తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఇండియాలోకి టెస్లా (Tesla) ప్రవేశించింది. అయితే టెస్లాకు ధీటుగా మరో ఎలక్ట్రిక్ వాహన కంపెనీ రంగంలోకి దిగింది.
వియత్నాం ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ.. విన్ ఫాస్ట్ ను (VinFast ) ఇండియాలో లాంచ్ చేసేందుకు రెడీ అయింది. విఎఫ్ 6, విఎఫ్ 7 పేరుతో ఎలక్ట్రిక్ suv లను తీసుకు వస్తున్నట్లు ప్రకటన చేసింది. అక్కడితో ఆగకుండా ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది కంపెనీ. ఈ బుకింగ్ కోసం 21 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ రిఫండబుల్ అంటూ ప్రకటన కూడా చేసింది. టెస్లా కార్లను దిగుమతి చేస్తుండగా... ఈ విన్ ఫాస్ట్ మాత్రం.. ఇండియాలోనే తయారీ ప్లాంట్లను రెండు బిలియన్ డాలర్లతో ప్రారంభించబోతోంది.
దేశవ్యాప్తంగా షోరూంలు కూడా తెరవనుంది విన్ ఫాస్ట్. ఇక విన్ ఫాస్ట్ vf 6 కారుదల 18 నుంచి 24 లక్షల మధ్య ఉంటుందని చెబుతున్నారు. ఈ కారు ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 440 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక విఎఫ్ 7 మోడల్ కారదర 30 నుంచి 35 లక్షల వరకు ఉంటుందట. ఇక ఈ కారు ఒక్కసారి ఫుల్ చార్జింగ్ 450 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు.






