- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VinFast: టెస్లా బాటలోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన గ్లోబల్ ఈవీ విన్‌ఫాస్ట్
భారత్‌లో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. దీన్ని గుజరాత్‌లోని సూరత్‌లో ఏర్పాటు చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో మళ్లీ ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) హవా మొదలైంది. గత కొన్ని నెలలు స్తబ్దుగా మారిన ఈవీ మార్కెట్ ఇటీవల గ్లోబల్ దిగ్గజం టెస్లా రాకతో తిరిగి పుంజుకుంటున్న ధోరణి కనిపిస్తోంది. తాజాగా వియత్నామీస్ ఈవీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత్‌లో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. దీన్ని గుజరాత్‌లోని సూరత్‌లో ఏర్పాటు చేసింది. టెస్లా మన మార్కెట్లలోకి అడుగుపెట్టిన రోజుల వ్యవధిలోనే విన్‌ఫాస్ట్ కూడా వచ్చేసింది. త్వరలో సూరత్‌లోనే తయారీ ప్లాంటును కూడా మొదలుపెడుతున్నట్టు విన్‌ఫాట్ వెల్లడించింది. సూరత్‌లోని పిప్లాడ్‌లో ఉన్న విన్‌ఫాస్ట్ షోరూమ్‌లో కొనుగోలు, అమ్మకాల తర్వాత సర్వీస్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలోని ప్రీమియం ఈవీ ఎస్‌యూవీలు వీఎఫ్6, వీఎఫ్7 మోడళ్లను మొదట పరిచయం చేస్తోంది. కంపెనీ తన కార్లలో కుడి-చేతి డ్రైవ్ వెర్షన్‌లను తీసుకొచ్చిన మొదటి మార్కెట్ కూడా భారత్ కావడం విశేషం. అంతేకాకుందా ఈ ఏడాది ఆఖరు నాటికి కంపెనీ 27 కంటే ఎక్కువ నగరాల్లో 35 డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. అయితే, ప్రస్తుతానికి కంపెనీ ఈ మోడళ్ల ధరలను అధికారికంగా వెల్లడించలేదు. వీటిని కొనాలనుకునే కస్టమర్లు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ. 21,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ మొత్తం పూర్తిగా రీఫండ్ అని కంపెనీ పేర్కొంది.






