Indian Toy Industry: బొమ్మల రాజ్యంలో ఇండియాదే హవా? ట్రంప్‌ వార్‌తో భారత్‌కు భలే లాభం

by Vennela |

Indian Toy Industry: చైనా దిగుమతులపై అమెరికా విధించిన అధిక సుంకాల నుంచి వచ్చే సువర్ణ అవకాశాన్ని వినియోగించుకునేందుకు భారతదేశ బొమ్మల ఎగుమతిదారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Indian Toy Industry: బొమ్మల రాజ్యంలో ఇండియాదే హవా? ట్రంప్‌ వార్‌తో భారత్‌కు భలే లాభం
X

దిశ, వెబ్ డెస్క్: Indian Toy Industry: చైనా దిగుమతులపై అమెరికా విధించిన అధిక సుంకాల నుంచి వచ్చే సువర్ణ అవకాశాన్ని వినియోగించుకునేందుకు భారతదేశ బొమ్మల ఎగుమతిదారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. చైనా వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రత్యామ్నాయ విధానాలవైపు చూస్తున్న అమెరికా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నవారు. ఈ మేరకు అమెరికా మార్కెట్ కు ఎగుమతి చేసే సామర్థ్యం ఉన్న సుమారు 40 సంస్థలను టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తించింది.

సుమారు 20 కంపెనీలు అమెరికన్ మార్కెట్ కు భారీ మొత్తంలో బొమ్మలను ఎగుమతి చేస్తున్నట్లు అధ్యక్షుడు అజయ్ అగర్వాల్ తెలిపారు. గత నెలలో అమెరికా ఆధారిత బొమ్మల కొనుగోలుదారుల నుంచి మాకు ఎంక్వైరీలు వచ్చాయి. అమెరికా నియమాలు, నిబంధనల ప్రకారం బొమ్మ ఉత్పత్తులను తయారు చేయగల తయారీదారుల జాబితాను కోరుతూ అన్ని భారతీయ ఎగుమతి సంస్థలు కడా మిమ్మల్ని సంప్రదించాయి. వారి అవసరాలను తీర్చే పరికరాల తయారీదారుల కోసం చూస్తున్నామని అజయ్ అగర్వాల్ తెలిపారు.

కాగా అమెరికాలో బొమ్మలకు భారీ మార్కెట్ ఉంది. అలాంటిది చైనా ఇప్పుడు అధిక సుంకాలకు లోనైతే భారత్ కే ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే మన దేశానికి చెందిన 20 కంపెనీలు అమెరికాకు పెద్ద మొత్తంలో బొమ్మలను ఎగుమతి చేస్తున్నాయి. ఇతర దేశాల కంటే తక్కువ ధరకే ఉండటం వల్ల మనకు సుంకాల ప్రయోజనం లభిస్తే అమెరికా మార్కెట్లో మన బొమ్మల ఉనికిని పెంచుకోవచ్చని అజయ్ అగర్వాల్ తెలిపారు.

అమెరికా మార్కెట్ కు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్న తయారీదారులతో అసోసియేషన్ త్వరలోనే ఒక సెమినార్ నిర్వహిస్తోందని తెలిపారు. ఇది భారతీయ బొమ్మల తయారీదారులకు సువర్ణ అవకాశమని, ఎందుకంటే అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల మార్కెట్ అని అన్నారు. ప్రభుత్వ మద్దతుతో దేశీయ బొమ్మల పరిశ్రమ తన ఎగుమతులను పెంచుకుంటుందని.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1శాతం కంటే తక్కువ ఉందని ఆయన తెలిపారు.

Next Story