- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Urban Company: గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన అర్బన్ కంపెనీ ఐపీఓ
మొత్తం 10.68 కోట్ల షేర్లను ఐపీఓ భాగంగా విక్రయానికి ఉంచగా, 13.54 కోట్లకు పైనే బిడ్లు వచ్చాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ హోమ్ సర్వీసెస్ కంపెనీ అర్బన్ కంపెనీ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) బుధవారం ప్రారంభమైంది. అయితే, ఇన్వెస్టర్ల నుంచి ఊహించని స్థాయిలో స్పందన రావడం విశేషం. ఐపీఓ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. బిడ్డింగ్ మొదటి రోజున ఈ ఇష్యూకు పెట్టుబడిదారుల నుంచి వచ్చిన స్పందనకు మధ్యాహ్నం సమయానికే ఇష్యూ మొత్తం 1.27 రెట్లు సబ్‌స్క్రైబ్ అయినట్టు ఎన్ఎస్ఈ డేటా చెబుతోంది. రిటైల్, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా పూర్తిస్థాయిలో సబ్‌స్క్రైబ్ అయింది. మొత్తం 10.68 కోట్ల షేర్లను ఐపీఓ భాగంగా విక్రయానికి ఉంచగా, 13.54 కోట్లకు పైనే బిడ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా దాదాపు 4 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 1.6 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్ బయర్స్ విభాగం 20 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యింది. కంపెనీ రూ. 1,900 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్ ఆఫర్‌కు వచ్చింది. ఒక్కో షేర్ ధరను రూ. 98-103గా నిర్ణయించింది. ఇప్పటికె యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 854 కోట్లను సేకరించిన తర్వాత ఐపీఓ కింద రూ. 1,428 కోట్ల విలువైన షేర్లను అమ్మకానికి ఉంచింది. ఐపీఓలో వచ్చిన నిధులను కంపెనీ క్లౌడ్ ఇన్‌ఫ్రా, ఆఫీసుల లీజింగ్ చెల్లింపులు, మార్కెటింగ్, టెక్ అభివృద్ధి, సాధారణ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తామని వెల్లడించింది.






