UPI Payments: యూపీఐ లావాదేవీల్లో ఆల్‌టైమ్ హై

by S Gopi |

పండుగ సీజన్‌, జీఎస్టీ 2.0 రేట్ల తగ్గింపు చర్యల అమలు కారణంగా ప్రజల వ్యయం, వ్యాపార కార్యకలాపాలు ఇందుకు మద్దతిచ్చాయి.

UPI Payments: యూపీఐ లావాదేవీల్లో ఆల్‌టైమ్ హై
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది అక్టోబర్ నెలలో యూపీఐ చెల్లింపులు సంబంధించి ఆల్‌టైమ్ హై స్థాయికి చేరాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అక్టోబర్‌లో లావాదేవీల సంఖ్య, విలువ రెండింటిలోనూ ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది, దీని ద్వారా రూ.27.28 లక్షల కోట్ల విలువైన 2,070 కోట్ల లావాదేవీలు జరిగాయి. దేశవ్యాప్తంగా పండుగ సీజన్‌, జీఎస్టీ 2.0 రేట్ల తగ్గింపు చర్యల అమలు కారణంగా ప్రజల వ్యయం, పెరిగిన వ్యాపార కార్యకలాపాలు ఇందుకు మద్దతిచ్చాయి. అంతేకాకుండా జీఎస్టీ నిబంధనలు సడలించడంతో పాటు రీఫండ్లు వేగంగా జరగడంతో చిన్న వ్యాపారాల్లో నగదు లభ్యత, రిటైల్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో పండుగ ఖర్చు పెరిగేందుకు వీలైందని ఫిన్‌టెక్ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ లావాదేవీలు అధికంగా ఉన్నాయి. వీటికి యూపీఐ క్రెడిట్ సౌకర్యాలు, యూపీఐ లైట్‌కు పెరుగుతున్న ఆదరణ కూడా ఇందుకు దోహదపడ్డాయని ఎన్‌పీసీఐ అభిప్రాయపడింది. డిజిటల్ చెల్లింపులకు సంబంధించి అందుబాటులో ఉన్న సదుపాయాలు, పెళ్లిళ్లు-ట్రావెల్ సీజన్ కాబట్టి రానున్న రోజుల్లో యూపీఐ లావాదేవీలు ఇదే ఊపులో కొనసాగుతాయని నిపుణులు భావిస్తున్నారు.

Next Story