UPI Transactions: పండుగ సీజన్‌లో యూపీఐ హవా.. రూ. 17.8 లక్షల కోట్ల లావాదేవీలు

by S Gopi |

ప్రజల నుంచి పెరిగిన ఖర్చులు, డిమాండ్ పునరుద్ధరణను ఈ మార్పు సంకేతమని నివేదిక అభిప్రాయపడింది.

UPI Transactions: పండుగ సీజన్‌లో యూపీఐ హవా.. రూ. 17.8 లక్షల కోట్ల లావాదేవీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది పండుగ సీజన్ సమయంలో దేశవ్యాప్తంగా భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఈ క్రమంలోనే డిజిటల్ చెల్లింపులకు కీలకమైన యూపీఐల హవా ఈ ఏడాది కూడా కొనసాగిందని బ్యాంక్ ఆఫ్ బరోడా తన తాజా నివేదికలో పేర్కొంది. పండుగ సీజన్‌లో చెల్లింపులకు యూపీఐ అత్యంత ముఖ్యమైన లావాదేవీల మార్గంగా ఉద్భవించింది. ప్రజల నుంచి పెరిగిన ఖర్చులు, డిమాండ్ పునరుద్ధరణను ఈ మార్పు సంకేతమని నివేదిక అభిప్రాయపడింది. గత సంవత్సరం పండుగ సీజన్‌కు రూ. 15.1 లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది రూ. 17.8 లక్షల కోట్లకు చేరింది. ముఖ్యంగా దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల సమయంలో డిజిటల్ చెల్లింపులు అత్యధికంగా జరిగాయి. యూపీఐతో పాటు డెబిట్ కార్డుల వినియోగం కూడా పెరిగింది. పండుగ సీజన్ సమయంలో వీటి చెల్లింపులు రూ. 65,395 కోట్లకు పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో ఇవి రూ. 27,566 కోట్లుగా నమోదయ్యాయి. చెల్లింపులకు యూపీఐ మొదటి ఆప్షన్ అయినప్పటికీ, డెబిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపులు కూడా పెరిగాయని, గత కొంతకాలంగా వీటి వినియోగం తగ్గుతున్న ధోరణికి ఈ లావాదేవీలు బ్రేక్ చేశాయని నివేదిక పేర్కొంది.

Next Story