- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPI Down: మరోసారి స్తంభించిన యూపీఐ సేవలు..
UPI Down: డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐలో మరోసారి అంతరాయం వాటిల్లింది.

దిశ, వెబ్ డెస్క్: UPI Down: డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐలో మరోసారి అంతరాయం వాటిల్లింది. దేశవ్యాప్తంగా ఈ సేవలకు ఆటంకం ఏర్పడింది. ఎవరికైనా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే జరగడం లేదంటూ సోషల్ మీడియాల్లో వందలాది మంది పోస్టులు చేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ పనిచేయడం లేదు. డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ ప్రకారం మధ్యాహ్నం 12గంటల సమయానికి దాదాపు 1000 మందికి పైగా యూపీఐ సేవల్లో అంతరాయం వాటిల్లినట్లు ఫిర్యాదు చేశారు.
ఇలా జరగడం ఇవాళ ఒక్కరోజే కాదు. యూపీఐ సేవల్లో ఈమధ్య తరుచుగా ఈ అవాంతరం ఎదురవుతోంది. దీనికి కారణం ఏంటన్నది తెలియలేదు. మార్చి 26న కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. సాంకేతిక కారణంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఎన్ పీసీఐ అప్పట్లో వివరణ కూడా ఇచ్చింది. ఏప్రిల్ 2న కూడా యూపీఐ చెల్లింపులు కొంతసేపు నిలిచిపోయాయి. రోజుల వ్యవధిలో తాజాగా మరోసారి ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ సేవల్లో ఆటంకం ఏర్పడింది. దీనిపై ఎన్ పీసీఐ అధికారికంగా స్పందించలేదు.






