- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPI: త్వరలో అంతర్జాతీయంగా యూపీఐ సేవలు
పేపాల్ వరల్డ్ ప్లాట్‌ఫామ్ అంతర్జాతీయంగా ఉన్న అతిపెద్ద చెల్లింపుల వ్యవస్థలు, డిజిటల్ వ్యాలెట్లను ఒకచోట చేరుస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: మనదేశంలో ఇప్పుడు ముప్పావు వంతు చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పటివరకు మనదేశంలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండగా, త్వరలో అంతర్జాతీయ లావాదేవీల్లో యూపీఐ సేవలు వాడుకునే అవకాశం రానుంది. దీనికోసం గ్లోబల్ పేమెంట్ కంపెనీ పేపాల్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పేపాల్ వరల్డ్ అనే కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా అంతర్జాతీయంగా ఉన్న అతిపెద్ద చెల్లింపుల వ్యవస్థలు, డిజిటల్ వ్యాలెట్లను ఒకచోట చేరుస్తుంది. ఇందులో భాగంగా ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు పేపాల్ ప్రకటించింది. దీంతో యూపీఐ వినియోగదారులు త్వరలో పేపాల్ కస్టమర్లతో పీ2ఫ్ (పీర్-టు-పీర్) లావాదేవీలను చేయవచ్చు. మరింత సులభంగా చెప్పాలంటే, ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఒకరికొకరు డబ్బు పంపే వీలుంటుంది. ప్రస్తుతం, ఈ ఫీచర్ యూఎస్-ఆధారిత చెల్లింపు సేవలందించే వెన్మోకి మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాకుండా, యూపీఐ కస్టమర్లు త్వరలో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే అవకాశం, పేపాల్‌ను అంగీకరించే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులోకి రావచ్చు. ఈ ఫీచర్ 2026 పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.






