- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్స్ జీవితంలో భాగమైపోయాయి.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్స్ జీవితంలో భాగమైపోయాయి. రోడ్డు పక్కన ఉంటే చిన్న చిన్న దుకాణాల దగ్గర నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. ఈ క్రమంలో సైబర్ నేరాలు (Cyber crimes) కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అప్రమత్తంగా లేకపోతే వారి వలలో చిక్కుకుని భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా యూపీఐ ఆధారంగా చేసే మోసాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి.
యూపీఐ పేమెంట్స్‌లో జాగ్రత్తలు ఇవే..
* డబ్బు పంపించేటప్పుడు కచ్చితంగా అవతలి వ్యక్తి పేరును తెలుసుకోండి. అప్పుడే సరైన వ్యక్తికి మీ డబ్బు చేరుతుంది. దుకాణాల్లో గోడలకు ఉన్న క్యూఆర్‌లను స్కాన్ చేసిన తర్వాత పేరు సరిగ్గా వచ్చిందా లేదా ధ్రువీకరించుకున్నాకే డబ్బును పంపించండి.
* యూపీఐ పిన్‌ను ఎవరికీ చెప్పొద్దు. బ్యాంకు ప్రతినిధులుగా చెప్పి ఎవరైనా ఫోన్ చేసి.. డెబిట్ కార్డులో చివరి నాలుగు అంకెలు చెప్పి, యూపీఐ పిన్ లేదా ఓటీపీలాంటివి చెప్పాలని అడుగుతుంటారు. అలాగే బ్యాంకు నుంచి వచ్చినట్లు మోసపూరిత ఇ-మెయిళ్లు పంపించి, లింకులను క్లిక్ చేసి, వివరాలను పూర్తి చేయాలని అంటారు. ఇలాంటి వాటికి అస్సలు స్పందించకూడదు.
* కొత్త యూపీఐ యాప్ వచ్చింది, డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా సందేశాలు వస్తుంటాయి. అలాంటివి నమ్మే ముందు ఆయా సంస్థల గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి. విశ్వసనీయ యాప్‌లను మాత్రమే డౌన్ లోడ్ చేయాలి.
* ఇటీవల కొన్ని మోసపూరిత ఉద్యోగ ప్రకటనలు వస్తున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు యూపీఐ ద్వారా నగదు చెల్లించాలని అడుగుతారు. అలా చెల్లిస్తేనే దరఖాస్తు చేసేందుకు వీలవుతుందని చెబుతారు. ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకున్నాకే ఇలాంటి వాటికి స్పందించాలి.
* ఇంకొ కొత్త తరహా మోసానికి కూడా ఇటీవల సైబర్ కేటుగాళ్లు తెరతీశారు. అనుకోకుండా మీ నంబరుకు డబ్బు పంపించాం. ఇదిగో స్క్రీన్‌షాట్ అంటూ ఫోన్లు చేస్తున్నారు. తిరిగి తమ డబ్బు తమకు పంపించాల్సిందిగా అడుగుతుంటారు. అయితే, నిజంగానే ఖాతాలో ఆ డబ్బు జమ అయ్యిందా లేదా అనేది చూసుకోవాలి. పొరపాటుగా డబ్బులు వచ్చాయని చెప్పినా.. ఆ విషయాన్ని బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాకే స్పందించాలి.
* ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే విక్రేతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చాలా మంది తక్కువ ధరకు వస్తున్నాయని ఇలాంటి వారికి యూపీఐ ద్వారా డబ్బు పంపి, వస్తువు కొనుగోలు చేస్తుంటారు. ఇందులో ఎవరు మోసపూరిత వ్యక్తులో మనకు తెలియదు. కాబట్టి, పూర్తి వివరాలు తెలుసుకున్నాకే, ఇంటికి వస్తువు వచ్చాకే చెల్లించే వీలున్నప్పుడే కొనుగోలు చేయండి.
* ఒకవేళ ఇలా మోసపోతే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. మీ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి చర్యలు తీసుకోవాలి. అలాగే, నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేయాలి.






