UPI: పిన్ అవసరం లేకుండా యూపీఐ లావాదేవీలు

by S Gopi |

ఫేస్ ఐడీ, బయోమెట్రిక్ పద్దతిలో లావాదేవీలను పూర్తి చేసేలా మార్పులు తెచ్చేందుకు ఎన్‌పీసీఐ ప్రయత్నాలు చేతున్నట్టు సమాచారం

UPI: పిన్ అవసరం లేకుండా యూపీఐ లావాదేవీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ)లో మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన లావాదేవీలకు అవకాశం కల్పించాలని ఎన్‌పీసీఐ భావిస్తోంది. ముఖ్యంగా ఏదైనా చెల్లింపులు చేసే సమయంలో లావాదేవీ పూర్తి చేయాలంటే పిన్ నంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. అయితే, దీని స్థానంలో ఫేస్ ఐడీ, బయోమెట్రిక్ పద్దతిలో లావాదేవీలను పూర్తి చేసేలా మార్పులు తెచ్చేందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ప్రయత్నాలు చేతున్నట్టు సమాచారం. డిజిటల్ లావాదేవీల్లో భద్రతను మెరుగుపరచడం, ఆర్థిక మోసాలను తగ్గించడం, చెల్లింపులను మరింత సురక్షితంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చే లక్ష్యంతో దీన్ని తీసుకురావాలని ఎన్‌పీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఉన్న బయోమెట్రిక్ సామర్థ్యాలను ఉపయోగించుకుని, యూపీఐ లావాదేవీల్లో ఫింగర్ ప్రింట్ ద్వరా చెల్లింపులు చేసేందుకు పలు స్టార్టప్‌లతో ఎన్‌పీసీఐ చర్చలు జరుపుతోందని సమాచారం. ఈ మార్పులు అమల్లోకి వస్తే ఇప్పుడున్న పిన్ స్థానంలో ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఉండే ఫింగర్ ప్రింట్, ఐఫోన్‌లలో ఉండే ఫేస్ ఐడీ ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. మాన్యువల్ పిన్ ఎంట్రీనిపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా వేగంగా, ఇబ్బందుల్లేని లావాదేవీలు నిర్వహించవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

Next Story