- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో సర్వీసును నిలిపివేస్తున్న UPI
మరో సేవలను నిలిపివేస్తున్నట్టు UPI ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : మరో సేవలను నిలిపివేస్తున్నట్టు UPI ప్రకటించింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు కలెక్ట్ రిక్వెస్ట్ సర్వీసును ఆపేస్తున్నట్టు పేర్కొంది. అక్టోబర్ 1 నుంచి యూపీఐ సేవల్లోని కలెక్ట్ రిక్వెస్ట్ సర్వీసును నిలిపివేస్తున్నామని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) నిర్ణయం తీసుకుంది. నగదును ఖాతాలో జమ చేస్తామని సైబర్ నేరగాళ్లు పిన్ నంబర్ ఎంటర్ చేయించుకొని డబ్బులు కాజేసేవాళ్ళు. అయితే వీటికి చెక్ పెట్టేందుకు కలెక్ట్ రిక్వెస్ట్ ట్రాన్సక్షన్ ను రూ.2 వేలకు తగ్గించినప్పటికీ, ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నట్టు NPCI గుర్తించి, ఈ సర్వీసును పూర్తిగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుండగా.. ఇప్పటికే బ్యాంకులకు, పేమెంట్స్ ఆప్స్ కు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇందుకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలని సూచించింది.






