- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Unsold Homes: దేశవ్యాప్తంగా 4 శాతం పెరిగిన అమ్ముడుపోని ఇళ్లు
కొత్త ఇళ్ల సరఫరా డిమాండ్ కంటే ఎక్కువగా ఉండటంతో ఏడు ప్రధాన నగరాల్లో ఇవి 4 శాతం అధికంగా 5.77 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రధాన ఏడు నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరిగాయి. ఈ మేరకు ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తాజా ప్రకటనలో వెల్లడించింది. కొత్త ఇళ్ల సరఫరా డిమాండ్ కంటే ఎక్కువగా ఉండటంతో ఏడు ప్రధాన నగరాల్లో ఇవి 4 శాతం అధికంగా 5.77 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. అంతకుముందు ఏడాది అమ్ముడుపోని ఇళ్లు మొత్తం 5,53,073 యూనిట్లు ఉంటే, 2025 చివరి నాటికి ఇవి 5,76,617 యూనిట్లకు పెరిగాయి. డిమాండ్ క్షీణించడంతో పాటు కొత్త ఇళ్ల నిర్మాణాలు అందుబాటులోకి రావడమే కారణమని అనరాక్ నివేదికలో పేర్కొంది. అనరాక్ డేటా ప్రకారం, ప్రధాన ఏడు నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 14 శాతం తగ్గి 3,95,625 యూనిట్లకు చేరగా, కొత్త ఇళ్ల సరఫరా 2 శాతం పెరిగి 4,19,170 యూనిట్లకు చేరింది. ముంబైలో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 1 శాతం తగ్గి 1.79 లక్షలకు చేరగా, హైదరాబాద్‌లో 2 శాతం తగ్గి 96,140 యూనిట్లకు చేరాయి. ఢిల్లీ ఎన్-ఎసీఆర్‌లో ఇవి 90,455 యూనిట్లకు(5 శాతం వృద్ధి), బెంగళూరులో 64,863 యూనిట్ల(23 శాతం వృద్ధి)కు చేరుకుంది. పూణేలో 83,491 యూనిట్ల(3 శాతం వృద్ధి)కు చేరుకుంది. చెన్నైలో 33,434 యూనిట్ల(18 శాతం వృద్ధి)కు చేరుకుంది. ఇక, కోల్‌కతాలో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 29,007 యూనిట్లుగా ఉందని నివేదిక పేర్కొంది.






