- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Unlisted Gems: అన్‌లిస్టెడ్ కంపెనీల జాబితాలో రిలయన్స్ రిటైల్ అగ్రస్థానం
మంగళవారం జేఎమ్ ఫైనాన్షియల్, హురున్ ఇండియా విడుదల చేసిన అన్‌లిస్టెడ్ జెమ్స్-2026 జాబితాలో రిలయన్స్ రిటైల్ రూ. 2.7 లక్షల కోట్ల భారీ ఆదాయంతో దేశంలోనే అతిపెద్ద అన్‌లిస్టెడ్ కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకుండా ఉన్న కంపెనీల్లో రిలయన్స్ రిటైల్ సంస్థ భారీ ఆదాయంతో అగ్రస్థానం సొంతం చేసుకుంది. మంగళవారం జేఎమ్ ఫైనాన్షియల్, హురున్ ఇండియా విడుదల చేసిన అన్‌లిస్టెడ్ జెమ్స్-2026 జాబితాలో రిలయన్స్ రిటైల్ రూ. 2.7 లక్షల కోట్ల భారీ ఆదాయంతో దేశంలోనే అతిపెద్ద అన్‌లిస్టెడ్ కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత రూ. 83,105 కోట్ల ఆదాయంతో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రెండో స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో దేశంలోని 100 పెద్ద అన్‌లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి, ఇవి ఒక్కొక్కటి కనీసం రూ. 1,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. జేఎమ్ ఫైనాన్షియల్, హురున్ ఇండియా నివేదిక ప్రకారం, రూ. 66,000 కోట్లతో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మూడో స్థానంలో ఉంది. ఈ వంద కంపెనీలు సంయుక్తంగా 2025లో రూ. 8.9 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఈ కంపెనీలన్నిటి విలువ రూ. 28.5 లక్షల కోట్లు. ఇవి దాదాపు 12 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. దేశంలో అన్‌లిస్టెడ్ కంపెనీలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, దేశ ఆర్థికవ్యవస్థలో బలమైన విభాగంగా మారాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయని, వీటిలో చాలావరకు భవిష్యత్తులో ఐపీఓలుగా వస్తాయని నివేదిక తెలిపింది. ఈ జాబితాలో కొన్ని కంపెనీలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. టాటా ఎలక్ట్రానిక్స్ 3,173 శాతంతో రికార్డు స్థాయి వృద్ధి రేటును నమోదు చేయగా, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 904 శాతం, జేఎస్‌డబ్ల్యూ వన్ ప్లాట్‌ఫామ్‌లు 522 శాతం వృద్ధి చూశాయి. ఈ వృద్ధి ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ బీ2బీ ప్లాట్‌ఫామ్ వంటి రంగాలలో పెరుగుతున్న డిమాండ్‌ను చూపిస్తుందని నివేదిక పేర్కొంది.






